Diwali Vastu Tips: దీపాలను దక్షిణంవైపు తిప్పకండి..లక్ష్మీపూజ సాయంత్రం 6.32గం-8.21గం చేయాలి

జీవితంలో చెడు రోజులు పోయి.. మంచి రోజులు.. రావాలని.. చీకటి దూరమయ్యి.. కాంతులతో నిండాలని జరుపునే పండుగ దీపావళి. అయితే ఈ వాస్తు సూచనలు పాటిస్తే మీరు అనుకున్నది నెరవేరుతుందని పండితులు తెలుపుతున్నారు.. అవేంటో మీరే చూడండి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 3, 2021, 06:46 PM IST
  • దీపాలను దక్షిణం వైపు తిప్పటం వలన అరిష్టం వాటిల్లుతుంది
  • లక్ష్మీ పూజ సాయంత్రం 6.32గం. నుండి 8.21గం. వరకు చేస్తే మంచిది
  • ప్రధాన ద్వారానికి ఇరువైపులా దీపాలు వెలిగిస్తే లక్ష్మీ, గణపతులను కటాక్షం పొందుతారు
  • పూజ గదిలో లక్ష్మీ దేవి చిత్రపటాన్ని ఉత్తరం వైపు ముఖం ఉండేలా పెట్టాలి
Diwali Vastu Tips: దీపాలను దక్షిణంవైపు తిప్పకండి..లక్ష్మీపూజ సాయంత్రం 6.32గం-8.21గం చేయాలి

Vastu Tips to Pump the Positivity on this Diwali: భారతీయ పండగలు, సాంప్రదాయాల చుట్టూ కొన్ని నమ్మకాలు ముడిపడి ఉంటాయి. దీపావళి పండగకు సంబంధించి కూడా కొన్ని నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా దీపావళి రోజు చేసే దీపాలంకరణకు సంబంధించి కొన్ని వాస్తు నియమాలను ప్రజలు విశ్వసిస్తుంటారు. ఆ నియమాల ప్రకారం దీపాలను అలంకరిస్తేనే ఇంటికి శుభం జరుగుతుందని నమ్ముతుంటారు.

వెలిగించిన దీపాలను దక్షిణం వైపు తిప్పకూడదని వాస్తును నమ్మేవారు చెబుతుంటారు. ఒకవేళ దక్షిణం వైపు తిప్పితే అది ఇంటికి అరిష్టమని భావిస్తారు. దీపాలను వెలిగించేందుకు పొద్దు తిరుగుడు నూనెను కాకుండా స్వచ్చమైన నెయ్యితో వెలిగించాలని చెబుతుంటారు. అలాగే మొదటి దీపాన్ని పూజ గదిలో దేవుడి చిత్రపటం లేదా ప్రతిమ ముందు వెలిగించాలంటారు.

Also Read: Diwali Offers: రూ. 21,999 శాంసంగ్​ గెలాక్సీ ఎం31 ఫోన్ కేవలం రూ.13,999కే.. త్వరపడండి

ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా దీపాలు వెలిగించడం ద్వారా లక్ష్మీ, గణపతులను ఇంటికి స్వాగతించవచ్చునని... తద్వారా దేవీదేవతల కరుణకటాక్షాలు లభిస్తాయని విశ్వసిస్తారు. ఇంటికి తూర్పు వైపు ఎరుపు, పసుపు, నారింజ దీపాలు, పడమర వైపు లేత పసుపు, నారింజ, గులాబీ రంగుల దీపాలు వెలిగిస్తే శుభం కలుగుతుందని భావిస్తారు. అలాగే ఉత్తరం వైపు నీలం, పసుపు, ఆకుపచ్చ దీపాలు, దక్షిణం వైపు తెలుపు, ఊదా, ఎరుపు రంగు దీపాలు వెలిగిస్తే శుభమని భావిస్తారు.

పండితులు చెప్పే వాస్తు నియమాల ప్రకారం.. ఇంట్లోని పూజ గదిలో లక్ష్మీ దేవి చిత్రపటాన్ని ఉత్తరం వైపు ముఖం ఉండేలా పెట్టాలి. లక్ష్మీదేవి ముందు డబ్బు, ఆభరణాలు, దీపాలు, ఇతర విలువైన వస్తువులు పెట్టి పూజ చేస్తే మంచిది. దీపావళి రోజు రాత్రి ఇల్లంతా దీపాలు వెలిగించడం ద్వారా ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ సంతరించుకునే అవకాశం ఉంటుంది. దీపావళి పండుగ నాడు (నవంబర్ 4) సాయంత్రం 6.32గం. నుంచి 8.21గం. వరకు లక్ష్మీ పూజకు అనువైన సమయమని పండితులు చెబుతున్నారు.

Also Read: Diwali Offer: బంపరాఫర్.. కొత్త ఇంటర్నెట్ కనెనక్షన్లపై రూ. 500 డిస్కౌంట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News