Team India New Jersey: యూఏఈ, ఒమన్‌ వేదికగా  ఈనెల 17 నుంచి మొదలుకానున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ (ICC T20 world cup 2021) కోసం భారత జట్టు ధరించబోయే కొత్త జెర్సీ(india new jersey)ని బుధవారం బీసీసీఐ(Bcci) విడుదల చేసిన సంగతి తెలిసిందే. భారత జట్టుకు కిట్ స్పాన్సర్ గా వ్యవహరిస్తున్న ఎంపీఎల్ స్పోర్ట్స్ (MPL Sports) ఈ జెర్సీని రూపొందించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే టీమిండియా(Team india) ఆటగాళ్లు ధరించబోయే సరికొత్త జెర్సీకి సంబంధించిన చిత్రాలను ప్రపంచంలోనే ఎత్తైన బిల్డింగ్‌ 'బుర్జ్‌ ఖలీఫా(burj khalifa)'పై బుధవారం రాత్రి ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియోను టీమిండియా అధికారిక కిట్ స్పాన్స‌ర్ ఎంపీఎల్ స్పోర్ట్స్(MPL Sports) ట్వీట్ చేస్తూ.. చరిత్రలో తొలిసారి టీమిండియా జెర్సీని ఈ ప్రపంచ ప్రఖ్యాత కట్టడంపై ప్రదర్శించారని పేర్కొంది. 'బిలియన్ చీర్స్ జెర్సీ'గా పిలువబడే ఈ జెర్సీని వంద కోట్ల మంది అభిమానుల చీర్స్ స్ఫూర్తితో త‌యారు చేశామ‌ని వెల్లడించింది. ఈ వీడియోలో టీమిండియా క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్‌ రాహుల్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రాలు కొత్త జెర్సీలు ధరించి కనిపించారు.  



Also read: Gambhir Sensational Commnets on Kohli: 'కోహ్లీ కెప్టెన్ గా పనికిరాడు.. ఆటగాడిగా ఓకే' : గంభీర్ సంచలన వ్యాఖ్యలు


ఇదిలా ఉంటే, గతేడాది ముంబై ఇండియన్స్(Mumbai Indians) ఐపీఎల్ టైటిల్ గెలిచిన అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ చిత్రాన్ని బూర్జ్ ఖలీపాపై ప్రదర్శించిన సంగతి తెలిసిందే. బుర్జ్ ఖలీఫాపై ఓ భారత క్రికెటర్ ఫొటో కనిపించడం అదే తొలిసారి. గతంలో మహాత్మా గాంధీ, షారుక్ ఖాన్‌ల ఫొటోలను ఈ ప్రపంచ ప్రఖ్యాత కట్టడంపై ప్రదర్శించారు. ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభంలో కోల్‌కతా నైట్ రైడర్స్ లోగో, ఆటగాళ్ల ఫొటోలను సైతం ఈ టవర్‌పై ప్రదర్శించారు. కాగా, అక్టోబర్‌ 17 నుంచి టీ20 ప్రపంచకప్‌ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. మెగా టోర్నీలో భాగంగా అక్టోబర్‌ 24న టీమిండియా తమ చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌తో తలపడనుంది. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి