Gambhir Sensational Commnets on Kohli: 'కోహ్లీ కెప్టెన్ గా పనికిరాడు.. ఆటగాడిగా ఓకే' : గంభీర్ సంచలన వ్యాఖ్యలు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ చివరి మ్యాచ్ ముగిసిన తరువాత గౌతమ్ గంభీర్ విరాట్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. 'కోహ్లీ కెప్టెన్ గా పనికిరాడు.. ఆటగాడిగా ఓకే' అన్న గంభీర్ వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో దుమారం రేగుతుంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 13, 2021, 02:06 PM IST
  • కోహ్లీపై సంచలన వ్యాఖ్యలు చేసిన గంభీర్
  • కోహ్లీ కెప్టెన్ గా పనికిరాడు..ఆటగాడిగా ఓకే అన్న గౌతమ్
  • సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్న గంభీర్ వ్యాఖ్యలు
Gambhir Sensational Commnets on Kohli: 'కోహ్లీ కెప్టెన్ గా పనికిరాడు.. ఆటగాడిగా ఓకే' : గంభీర్ సంచలన వ్యాఖ్యలు

Gautam Gambhir Sensational Comments on Virat Kohli: ఐపీఎల్ 2021 (IPL 2021)  రెండో దశలో భాగంగా సోమవారం జరిగిన ఎలిమినేటర్ (Eliminator Match IPL 2021) మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో (Royal Challengers Bangalore) ఆడిన కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) లో ఆర్సీబీ (RCB) ఓటమి పాలై టోర్నమెంట్ నుండి నిష్క్రమించిన సంగతి మనకు తెలిసిందే. 

ఇందులో భాగంగా కోహ్లీకి (Kohli) ఈ సీజన్ కెప్టెన్ గా  చివరి మ్యాచ్ కాగా.. ఎలాగైన కప్ గెలచి.. ఘనంగా కెప్టెన్సీ నుండి వైదొలగాలని భావించాడు. కాకపోతే ఆర్సీబీకి ఐపీఎల్ కప్ సాధించి పెట్టాలన్న కోహ్లీ కోరిక నెరవేరకుండానే టోర్నీ లోనుంచి నిష్క్రమించటంతో నిరాశగానే కోహ్లీ కెప్టెన్సీకి (Captain Kohli) గుడ్ బై చెప్పాడు. 

Also Read: Special Poster from Radhe shyam: హ్యాపీ బర్త్ డే పూజ.. స్పెషల్ పోస్టర్ విడుదల చేసిన రాధేశ్యామ్

2013 నుండి ఐపీఎల్‌ (IPL2013)  లో ఆర్సీబీ (RCB) తరపున ఆడుతున్న వరకు కోహ్లీ 140 మ్యాచ్‌లకు కెప్టెన్ గా ఉన్న 66 మ్యాచ్ లలో విజయం సాధించగా, 70 మ్యాచ్ లలో ఆర్సీబీ ఓడిపోయింది మరియు 44 మ్యాచ్ లలో ఫలితాలు తేలలేదు. పలువురు క్రికెటర్లు కెప్టెన్ గా కోహ్లీ (Captain Kohli) ప్రదర్శనపై వివిధ రకాలుగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది హేళనగా కామెంట్స్ చేస్తుంటే మరి కొందరు.. ఐపీఎల్‌లో (IPL) అందరికంటే ఎక్కువగా 6076 పరుగులు సాధించిన విరాట్ కోహ్లీని తక్కువగా చూడటం సరికాదని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. 

అయితే, విరాట్ కోహ్లీ పై మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ (Ex. Team India Player Goutam Gambir) సంచలన వ్యాఖ్యలు చేశారు. "విరాట్ కోహ్లీ మంచి వ్యూహకర్త కానే కాదు... అందువల్లనే  ఆర్సీబీ టీమ్ ఇప్పటి వరకు టైటిల్ గెలవలేకపోయింది" అంటూ కామెంట్స్ చేసారు. అంతేకాకూండా  బౌలింగ్, బ్యాటింగ్ లైనప్ (Bowling Battng Line Up) అంశాల్లో కోహ్లీకి క్లారిటీ ఉండేదికాదని.. మిగతా ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఈ విషయంలో ఎక్కువ మార్పులు చేయకుండా బౌలింగ్, బ్యాటింగ్ లైనప్‌ను యధాతథంగా కొనసాగించేవారని గౌతమ్ తెలిపారు. ఐపీఎల్ లో కోహ్లీ ఆర్సీబీ కెప్టెన్‌గా నిరాశపరిచిన.. ఆటగాడిగా మంచి పెర్ఫామెన్స్ ఇచ్చారని గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డారు.

Also Read: APPSC Notification Released: గుడ్ న్యూస్... ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీపీఎస్సీ

అయితే విరాట్ కోహ్లీ పై గౌతమ్ గంభీర్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం లేపుతున్నాయి. "కెప్టెన్ గా పనికిరాడు... ఆటగాడిగా ఓకే" (virat kohli was never a good tactician) అన్న గౌతమ్ వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో కోహ్లీ ఫ్యాన్స్ గంభీర్ పై మండిపడుతున్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News