Tamil Nadu Batter N Jagadeesan breaks Rohit Sharma Record in Vijay Hazare Trophy 2022: శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర, టీమిండియా ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డులు బ్రేక్ అయ్యాయి. సంగక్కర, రోహిత్ రికార్డ్స్ బ్రేక్ చేసింది మరెవరో కాదు.. మన దేశవాళీ క్రికెటర్. అతడే తమిళనాడు స్టార్‌ ఆటగాడు నారాయణ్ జగదీశన్. విజయ్ హజారే ట్రోఫీ 2022లో సెంచరీలు మోత మోగిస్తున్న జగదీశన్.. అరుణాచల్ ప్రదేశ్‌తో మ్యాచ్‌లో ఏకంగా డబుల్‌ సెంచరీ బాదాడు. 141 బంతులు ఎదుర్కొన్న జగదీశన్.. తన ఇన్నింగ్స్‌లో ఏకంగా 15 సిక్స్‌లు, 25 ఫోర్లు బాది 277 పరుగులు చేశాడు. హజారే ట్రోఫీ 2022లో జగదీశన్ ఐదో సెంచరీ బాదాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విజయ్ హజారే ట్రోఫీ 2022లో నారాయణ్ జగదీశన్ పరుగుల వరద పారిస్తున్నాడు. ఇప్పటికే నాలుగు శతకాలు బాదిన అతడు అరుణాచల్ ప్రదేశ్‌తో మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీ సాధించాడు. తద్వారా జగదీశన్ ఓ ప్రపంచ రికార్డును తన పేరుపై లిఖించుకున్నాడు. లిస్ట్‌-ఏ క్రికెట్‌లో వరుసగా 5 సెంచరీలు చేసిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. ఈ రికార్డు క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కర పేరుపై ఉండేది. 2014-15 సీజన్‌లో సంగా నాలుగు సెంచరీలు బాదాడు. తాజా శతకంతో ఈ అరుదైన రికార్డును జగదీశన్ తన పేరుపై లిఖించుకున్నాడు. 


మరోవైపు లిస్ట్‌-ఏ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ సాధించిన ఆటగాడిగా తమిళనాడు స్టార్‌ ఆటగాడు నారాయణ్ జగదీశన్ రికార్డులోకి ఎక్కాడు. అంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ క్రికెటర్‌ అలిస్టర్ బ్రౌన్ పేరిట ఉండేది. బ్రౌన్ 268 రన్స్ చేశాడు. అదే విధంగా లిస్ట్‌-ఏ క్రికెట్‌లో భారత్ తరపున అత్యధిక వ్యక్తిగత సాధించిన రోహిత్‌ శర్మ (264) రికార్డును కూడా జగదీశన్ బద్దలు కొట్టాడు. 2014లో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచులో రోహిత్‌ 264 రన్స్ చేశాడు. 


తమిళనాడు, అరుణాచల్ ప్రదేశ్‌ మధ్య వన్డే మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సోమవారం ఉదయం ఆరంభం అయింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన తమిళనాడు నిర్ణీత 50 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 506 పరుగులు చేసింది. జగదీశన్‌తో పాటు మరో ఓపెనర్‌ సాయి సుదర్శన్ (154) పరుగులతో రాణించాడు. అనంతరం 28.4 ఓవర్లలో 71 పరుగులకే ఆలౌట్ అయింది. దాంతో తమిళనాడు 435 పరుగుల తేడాతో గెలిచింది. 


Also Read: పడగ విప్పిన 16 అడుగుల కింగ్ కోబ్రాను కిస్ చేసిన వ్యక్తి.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!


Also Read: Mahesh Babu : గంగానదిలో అమ్మ అస్థికలు.. కృష్ణానదిలో నాన్న అస్థికలు.. పుట్టెడు దుఃఖంలో మహేష్‌ బాబు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook