Tamim Iqbal retirement: ప్రపంచకప్‌కు ముందు అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించి షాకిచ్చిన బంగ్లాదేశ్ వన్డే జట్టు కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ తాజాగా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. రిటైర్మెంట్ విషయమై తమీమ్ శుక్రవారం ఆ దేశ ప్రధాని షేక్ హసీనాను కలిశారు. రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రధాని కోరడంతో మనసు మార్చుకున్నానని.. అందుకే రాజీనామాను ఉపసంహరించుకుంటున్నట్లు తమీమ్ చెప్పాడు. నెలన్నరపాటు ఆటకు దూరంగా ఉండాలని ప్రధాని తనను స్వయంగా కోరారని.. అందుకే నెలన్నరపాటు గ్యాప్ ఇచ్చి.. మానసికంగా రెడీగా ఉన్నప్పడే మ్యాచ్ లు ఆడాలనుకుంటున్నా అని తమీమ్ తెలిపాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

34 ఏళ్ల తమీమ్‌ ఇక్బాల్ 2007 ఫిబ్రవరి నెలలో బంగ్లాదేశ్ తరపున తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. అదే ఏడాది ప్రపంచకప్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో జట్టును గెలిపించి శభాష్ అనిపించుకున్నాడు. బంగ్లా తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు చేయడంతో పాటు అత్యధిక శతకాలు బాదిన ఆటగాడిగా రికార్డు తమీమ్ పేరుపైనే ఉంది. దాదాపు 16 ఏళ్లపాటు అంతర్జాతీయ క్రికెట్ కు సేవలందించాడు ఈ స్టార్ ప్లేయర్. బంగ్లాదేశ్ తరుపున 389 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడాడు తమీమ్. మూడు ఫార్మాట్లలో కలిపి 15, 205 పరుగులు చేశాడు. గతేడాది ఇదే సమయంలో టీ20 కెరీర్ కు వీడ్కోలు పలికాడు తమీమ్.


Also Read: ICC Test Rankings: నెం. 1గా కేన్ మామ.. భారత్ నుంచి అతనొక్కడే..


తమీమ్ 241 వన్డేలు ఆడగా.. 36.62 సగటుతో 8313 రన్స్ చేశాడు. ఇందులో 14 సెంచరీలు, 56 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.  70 టెస్ట్ మ్యాచ్‌లలో 38.89 సగటుతో 5134 పరుగులు చేశాడు. ఇందులో 10 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 70 టీ20 మ్యాచ్‌ల్లో 24.08 సగటుతో 1758 రన్స్ చేశాడు. తమీమ్ బంగ్లాదేశ్‌కు 37 వన్డేల్లో నాయకత్వం వహించాడు. ఇందులో 21 మ్యాచ్‌ల్లో జట్టును గెలిపించాడు. 


Also Read: ODI World Cup 2023: ట్విస్ట్ అదిరింది.. వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించిన నెదర్లాండ్స్‌.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి