ICC Test Rankings: నెం. 1గా కేన్ మామ.. భారత్ నుంచి అతనొక్కడే..

ICC Test Rankings; ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో కేన్ మామ సత్తా చాటాడు. 100 రోజులకుపైగా ఆటకు దూరంగా ఉన్న సరే కేన్ విలియమ్సన్ తొలి ర్యాంకు దక్కించుకున్నారు. టాప్-10లో భారత్ నుంచి ఒక్కే ఒక్క ఆటగాడు ఉన్నాడు.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 6, 2023, 07:44 AM IST
ICC Test Rankings: నెం. 1గా కేన్ మామ.. భారత్ నుంచి అతనొక్కడే..

Kane Williamson Achieves Career-Best Rankings In Test Cricket: ఐసీసీ తాజాగా టెస్టు ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది. ఇందులో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అగ్రస్థానం దక్కించుకున్నాడు. ఇప్పటి వరకు మెుదటి ర్యాంకులో కొనసాగిన ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ ఐదో ర్యాంకుకు పడిపోయాడు. యాషెస్ సిరీస్ లో జో రూట్ పేలవ ప్రదర్శనే అతని ర్యాంకు దిగజారడానికి కారణమైంది. కేన్ మామ నెం. 1 ర్యాంకు సొంతం చేసుకోవడం అతడి టెస్టు కెరీర్ లో ఇదే మెుదటిసారి. 

దాదాపు 110 రోజులగా ఆటకు దూరంగా ఉన్న విలియమ్సన్ టాప్ ప్లేస్ దక్కించుకోవడం విశేషం. తన చివరి టెస్టు మ్యాచ్ మార్చి 17న శ్రీలంకతో ఆడాడు. కేన్ విలియమ్సన్ అత్యధిక కాలం ఫస్ట్ ర్యాంకులో కొనసాగే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే యాషెస్ సిరీస్ లో మరో మూడు టెస్టులు మిగిలి ఉన్నాయి. ఈ మ్యాచుల్లో స్టీవ్ స్మిత్ గనుక చెలరేగితే కేన్ మామ ర్యాంకు గల్లంతయ్యే అవకాశం ఉంది. 

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్
కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్)- తొలి ర్యాంకు
స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా)- రెండో ర్యాంకు
మార్నస్ లబుషేన్ (ఆస్ట్రేలియా)- మూడో ర్యాంకు
ట్రావిస్ హెడ్ (ఆస్ట్రేలియా) - నాలుగో ర్యాంకు
జో రూట్(ఇంగ్లాండ్)- ఐదో ర్యాంకు
రిషభ్ పంత్ (భారత్)- పదో ర్యాంకు
రోహిత్ శర్మ (భారత్)-  12వ ర్యాంకు
విరాట్ కోహ్లీ (భారత్)- 14వ ర్యాంకు

మరోవైపు బౌలర్ల విషయానికొస్తే.. ఈ జాబితాలో రవిచంద్రన్ అశ్విన్ 860 పాయింట్లతో మెుదటి ర్యాంకును దక్కించుకున్నాడు. బుమ్రా 8, రవీంద్ర జడేజా 9వ ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. పాట్ కమిన్స్ రెండో ర్యాంకు, రబాడా మూడు, జేమ్స్ అండర్సన్ నాలుగు, రాబిన్సన్ ఐదు, షాహీన్ ఆఫ్రిది ఆరు, నాథన్ లియాన్ ఏడు, బ్రాడ్ పదో ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. 

Also Read: IND Vs WI T20 Squad: టీమిండియా జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా.. తెలుగు కుర్రాడికి చోటు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook  

Trending News