DC vs CSK Live Score: సొంత మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ మెరిశాడు. విశాఖపట్టణాన్ని సొంత మైదానంగా ప్రకటించిన ఢిల్లీ సత్తా చాటింది. ఆల్‌ రౌండ్‌ ప్రదర్శనతో డీసీ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. కాగా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ చివరలో బ్యాట్‌తో మెరుపులు చేసినా కూడా చెన్నైకి సూపర్‌కింగ్స్‌కు నిరాశే ఎదురైంది. ఢిల్లీ చేతిలో 20 పరుగుల తేడాతో సీఎస్కే పరాజయం పొందింది. ఈ సీజన్‌లో ఢిల్లీకి తొలి గెలుపు కాగా.. చెన్నైకి తొలి ఓటమి కావడం విశేషం.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: KL Rahul Parent: కేఎల్‌ రాహుల్‌ తండ్రి కాబోతున్నాడా? పిల్లనిచ్చిన 'మామ' ఆసక్తికర వ్యాఖ్యలు


టాస్‌ నెగ్గి అనూహ్యంగా బ్యాటింగ్‌కు దిగిన పంత్‌ సేన నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. టాపార్డర్‌ పృథ్వీ షా (43), డేవిడ్‌ వార్నర్‌ (52), కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ (51) బ్యాటింగ్‌తో రఫ్పాడించారు. అనంతరం వచ్చిన మిడిలార్డర్‌లో మిచెల్‌ మార్ష్‌ (18) పర్వాలేదనిపించగా స్టబ్స్‌ పరుగులు చేయకుండానే మైదానం వీడాడు. అక్షర్‌ పటేల్‌, అభిషేక్‌ పరేల్‌ డబులు డిజిట్‌ స్కోర్‌ చేయలేదు. అతికష్టంగా ఢిల 191 పరుగులకు ఢిల్లీ పరిమితమైంది. చెన్నై బౌలర్లు చక్కటి బౌలింగ్‌తో ఢిల్లీ పరుగులకు కళ్లెం వేశారు. మతీష పతిరణ అద్భుత బౌలింగ్‌తో కీలకమైన మూడు వికెట్లు పడగొట్టి డీసీపై ఆధిపత్యం చలాయించాడు. రవీంద్ర జడేజా, ముస్తఫిజర్‌ రహమన్‌ చెరో వికెట్‌ తీశారు.

Also Read: RCB vs KKR Live Score: విరాట్‌ కోహ్లీ శ్రమ వృథా.. కేకేఆర్‌ చేతిలో బెంగళూరు బోల్తా


సాధారణ లక్ష్యాన్ని ఛేదించడంలో చెన్నై తడబడింది. చివర్లో సీనియర్‌ ఆటగాడు ధోని బ్యాట్‌తో అద్భుత బ్యాటింగ్‌ చేసినా బంతులు లేకపోవడంతో జట్టు విజయతీరాలకు చేరలేదు. నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి .... పరుగులు చేసి ఓటమి అంచున నిలిచింది. ఓపెనర్లుగా దిగిన రుతురాజ్‌ గైక్వాడ్‌, రచిన్‌ రవీంద్ర 1, 2 పరుగులకు మైదానం వీడడంతో చెన్నైలో ప్రమాదంలో పడింది. మిడిలార్డర్‌లో వచ్చిన అజింక్యా రహనే (45), డేరిల్‌ మిచెల్‌ (34) నిలకడైన ఆటతో పరుగులు రాబట్టారు. సమీర్‌ రజ్వీ ఒక్క పరుగు చేయకుండానే మైదానం వీడగా.. రవీంద్ర జడేజా (21), ధోనీ (37) రంగంలోకి దిగారు. బంతులు తక్కువ ఉన్నా కూడా విజయం సాధించేందుకు తీవ్రంగా శ్రమించారు. ఆఖరి రెండు ఓవర్లలో మాజీ కెప్టెన్‌ ధోని అద్భుతంగా ఆడి ఓటమి అంతరాన్ని తగ్గించారు.

బ్యాటర్లు చేసిన స్కోర్‌ను కాపాడుకోవడంలో ఢిల్లీ బౌలర్లు విజయవంతమయ్యారు. ప్రారంభమే టాపార్డర్‌ను కుప్పకూల్చి చావుదెబ్బ కొట్టారు. ముకేశ్ కుమార్‌ మూడు వికెట్లతో సత్తా చటాగా.. ఖాలీ అహ్మద్‌ రెండు, అక్షర్‌ పటేల్‌ ఒక వికెట్‌ పడగొట్టారు. ఫినిషింగ్‌తో అనేకసార్లు జట్టుకు విజయాలు అందించిన ధోనిని కూడా ఢిల్లీ బౌలర్లు నియంత్రించారు. దూకుడుగా ఆడకుండా కట్టుదిట్టంగా బౌలింగ్‌ వేసి జట్టుకు తొలి విజయాన్ని అందించారు.  వరుస రెండు విజయాల అనంతరం చెన్నై తొలి ఓటమిని చవిచూసింది. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook