Ind vs Aus Test 2024: భారత్ ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా 5 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభమైంది. పెర్త్‌లో జరిగిన మొదటి టెస్ట్‌లో టీమ్ ఇండియా విజయం సాధించి సిరీస్ 1-0తో ఆధిక్యంలో ఉంది. నాలుగోరోజు ఆట ముగియకుండానే ఆసీస్‌ను ఆలవుట్ చేసి 295 పరుగుల ఆధిక్యంతో విజయం అందుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పెర్త్‌లో జరిగిన తొలి టెస్ట్‌లో ఇండియా కంగారూలను మట్టికరిపించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 150 పరుగులకే కుప్పకూలింది. ఆ తరువాత ఇండియన్ పేసర్లు రెచ్చిపోవడంతో ఏకంగా 104 పరుగులకే ఆసీస్ ఆలవుట్ అయింది. ఆ తరువాత రెండవ ఇన్నింగ్స్‌ల టీమ్ ఇండియా బ్యాటర్లు రెచ్చిపోవడంతో 6 వికెట్ల నష్టానికి 487 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దాంతో ఆసీస్‌కు 534 పరుగుల భారీ టార్గెట్లభించింది. టెస్ట్ మ్యాచ్ మూడో రోజే ఆసీస్‌కు అప్పగించింది. మూడో రోజు చివరి సెషన్‌లో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 12 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. టీమ్ ఇండియా పేసర్లు మొహమ్మద్ సిరాజ్, బూమ్రా చెరో మూడు వికెట్లు తీశారు. వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు పడగొట్టాడు. నితీష్ రెడ్డి, హర్షిత్ రాణా చెరో వికెట్ సాధించారు. మొత్తానికి ఆసీస్ 238 పరుగులకే ఆస్ట్రేలియా ఆలవుట్ అయింది. ఆసీస్ గడ్డపై కెప్టెన్‌గా బూమ్రాకు తొలి విజయం లబించింది.


Also read: IPL 2025 Kavya Maran Strategy: రెండో రోజు వేలంలో కావ్య మారన్ ప్లాన్ ఇదేనా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.