Ravindra Jadeja Revealed His Career Secrets: గాయం కారణంగా దాదాపు 8 నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ద్వారా టీమిండియా స్టార్ ఆల్‌రౌంటర్ రవీంద్ర జడేజా టీమ్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. టెస్టు సిరీస్‌లో బంతితో విధ్వంసం సృష్టించి.. 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌'గా ఎంపికయ్యాడు. ఆసీస్‌తో జరిగిన తొలి వన్డేలోనూ అదరగొట్టాడు. బౌలింగ్‌లో రెండు కీలక వికెట్లు తీయడంతోపాటు.. బ్యాటింగ్‌ విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. కేఎల్ రాహుల్‌తో కలిసి సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును గెలిపించాడు. జడేజా 45 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. నేడు జరిగే రెండో వన్డేలోనూ జడేజా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు జడేజా ఓ సీక్రెట్‌ను బయటపెట్టాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స్టార్ స్పోర్ట్స్ టాటా ఐపీఎల్ 2023 ప్రివ్యూ షో "స్టార్స్ ఆన్ ది స్టార్"లో జడేజా మాట్లాడుతూ.. తాను మొదట ఫాస్ట్ బౌలర్ కావాలనుకున్నట్లు వెల్లడించాడు. 'నేను చాలా కాలం క్రితం క్రికెట్ ఆడటం ప్రారంభించినప్పుడు.. నేను ఫాస్ట్ బౌలర్ కావాలని అనుకున్నాను. ఇతర ఫాస్ట్ బౌలర్లు బౌన్సర్లు వేయడం నాకు చాలా ఇష్టం. స్పీడ్ బౌలర్లను చూసి నేనూ బ్యాట్స్‌మెన్‌పై బౌన్సర్లు వేస్తానని అనుకునేవాడిని. కానీ ఫాస్ట్ బౌలర్‌గా ఉండేంత పేస్ నాకు లేదు. 


జామ్‌నగర్‌లో నాకు కోచ్‌గా ఉన్న మహేంద్ర సింగ్ చౌహాన్, చెన్నై జట్టులో నా కెప్టెన్ అయిన మహేంద్ర సింగ్ ధోనీ మధ్య నా క్రికెట్ ప్రయాణం జరిగింది. ఈ ఇద్దరు మహేంద్రల మధ్య నా క్రికెట్ ప్రయాణం సాగిందని నేను మహీ భాయ్‌తో చెప్పాను..' అని జడేజా చెప్పుకొచ్చాడు. 


ఇక నేడు విశాఖ వేదికగా జరిగే రెండో వన్డేకు వర్షం ముప్పు పొంచి. భారీ వర్షం కురుస్తుండడంతో స్టేడియాన్ని కవర్లతో కప్పి ఉంచారు. మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుండడంతో అప్పటికల్లా వర్షం తగ్గిపోతుందని అభిమానులు ఆశిస్తున్నారు. మరోవైపు తొలి వన్డేకు దూరమైన హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ.. ఈ మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చాడు. రోహిత్ ఎంట్రీతో ఇషాన్ కిషన్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. 


Also Read: Ecuador Earthquake: ఈక్వెడార్‌లో భారీ భూకంపం.. 14 మంది మృతి


Also Read: AP Weather Report: నేడు ఈ జిల్లాలకు భారీ రెయిన్ అలర్ట్.. పిడుగులు పడే అవకాశం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి