Kohli World Records: కోహ్లీ ప్రపంచ రికార్డు, సచిన్ పేరిట మూడు రికార్డులు బ్రేక్
Kohli World Records: టీమ్ ఇండియా కింగ్ విరాట్ కోహ్లి కన్నేస్తే ఆగుతుందా. అనుకున్నది సాధించాడు. ఒకటి కాదు రెండు కాదు మూడు రికార్డుల్ని బ్రేక్ చేశాడు. తానొక్కడిగా నిలిచాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌ను దాటేశాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Kohli World Records: ప్రపంచకప్ 2023 తొలి సెమీఫైనల్స్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ముంబై వాంఖడే స్డేడియం వేదికగా మూడు ప్రపంచ రికార్డులు బ్రేక్ అయ్యాయి. సచిన్ పేరిట ఉన్న మూడు రికార్డుల్ని అధిగమించి తానొక్కడినేనని నిరూపించాడు. కోహ్లీ సాధించిన రికార్డు వివరాలు ఇలా ...
ప్రపంచకప్ 2023లో ఇండియా దూసుకుపోతోంది. టైటిల్ కచ్చితంగా గెలుస్తుందనే అంచనాలున్నాయి. అదే సమయంలో మొత్తం టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబరుస్తూ ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇవాళ్టి సెమీపైనల్ మ్యాచ్ కంటే ముందు ఇప్పటి వరకూ సచిన్ పేరిట ఉన్న మూడు ప్రపంచ రికార్డులకు అత్యంత చేరువలో నిలిచాడు విరాట్ కోహ్లీ. ఇవాళ జరిగే సెమీస్‌లో విరాట్ కోహ్లీ ఆ మూడు రికార్డుల్ని బ్రేక్ చేస్తాడా లేదా అనే ఆసక్తి రేగింది. కానీ అక్కడున్నది విరాట్ కోహ్లీ. కన్నేస్తే రికార్డు ఆగుతుందా మరి. ఆగనే ఆగదు. సచిన్ పేరిట ఉన్న మూడు ప్రపంచ రికార్డుల్ని బ్రేక్ చేశాడు. ఆ రికార్డులు ఇవీ...
ఇవాళ జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో విరాట్ అద్భుతంగా రాణించి 117 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తద్వారా ఈ ప్రపంచకప్‌లో ఇప్పటి వరకూ అత్యధికంగా 711 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంతేకాదు ఒకే ప్రపంచకప్ ఎడిషన్‌లో అత్యదిక పరుగులు చేసిన ఏకైక బ్యాటర్‌గా కొత్త రికార్డు సాధించాడు. ఇప్పటి వరకూ ఈ రికార్డు సచిన్ పేరిట 2003 ప్రపంచకప్‌లో 673 పరుగులుండేవి.
ఇక మరో ముఖ్యమైన రికార్డు వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన రికార్డు. ఇవాళ్టి సెంచరీతో 50 సెంచరీలు పూర్తి చేసి సచిన్ 49 సెంచరీల రికార్డు బ్రేక్ చేశాడు. మొన్న దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో సచిన్ రికార్డు సమం చేసిన కోహ్లీ ఇవాళ ఆ రికార్డు బ్రేక్ చేశాడు.
ఇక ఈ ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ మరో రికార్డు బ్రేక్ చేశాడు. అది కూడా సచిన్ రికార్డే. ఈ ప్రపంచకప్‌లో 8 హాఫ్ సెంచరీలతో సచిన్, షకీబుల్ హసన్ చేసిన 7 హాఫ్ సెంచరీల రికార్డును అధిగమించాడు.
అందరూ ఊహించినట్టే, అందరి అంచనాల్ని అందుకుంటూనే విరాట్ కోహ్లీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఒకే ఒక్క సెంచరీతో ముూడు రికార్డు బ్రేక్ చేశాడు. హ్యాట్సాఫ్ టు విరాట్ కోహ్లి..
Also read: Virat Kohli on Records: సచిన్ మూడు ప్రపంచ రికార్డులకు చేరువలో కోహ్లి, బ్రేక్ చేస్తాడా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook