టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు..!
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య మరోసారి ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య మరోసారి ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు. గత సంవత్సరం డిసెంబర్ 26వ తేదిన తన ట్విట్టర్ ఖాతాలో హార్దిక్ పాండ్య, డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ పై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో రాజస్థాన్ ప్రాంతానికి చెందిన రాష్ట్రీయ భీమ్ సేన సంఘం ఆయనపై కోర్టులో పిటీషను దాఖలు చేయగా.. ఎట్టకేలకు పాండ్యపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేయాల్సి ఉందని జోధ్ పూర్ కోర్టు పోలీస్ యంత్రాంగాన్ని ఆదేశించింది.
తొలుత కోర్టులో పిటీషను దాఖలు చేయకముందు.. పోలీసుల వద్దకు ఫిర్యాదును తీసుకెళ్లగా.. వారు కేసు నమోదు చేయడానికి నిరాకరించారు. ఆ తర్వాత కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేశారు. డిసెంబరు 26, 2017 తేదిన హార్దిక్ పాండ్య తన ట్విటర్‌లో అంబేద్కరును రిజర్వేషన్ అనే వ్యాధిని వ్యాప్తి చేసిన వ్యక్తిగా అభివర్ణించారు.