Umesh Yadav Father Passed Away: టీమిండియా స్టార్ పేస్ బౌలర్ ఉమేశ్ యాదవ్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఉమేశ్ తండ్రి తిలక్ యాదవ్ కన్నుమూశారు. ఉత్తరప్రదేశ్‌లో జన్మించిన ఉమేష్ తండ్రి తిలక్.. బొగ్గు గనిలో పనిచేస్తూనే కొడుకును అంతర్జాతీయ క్రికెటర్‌గా తీర్చిదిద్దారు. ప్రస్తుతం నాగ్‌పూర్ నివాసం ఉంటుండగా.. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నా.. కోలుకోలేక బుధవారం రాత్రి తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌లో భాగంగా జట్టుతో ఉన్న ఉమేశ్ యాదవ్.. తండ్రి మరణవార్తతో తీవ్ర విషాదంలో ముగినిపోయాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉమేశ్ యాదవ్ తండ్రి తిలక్ యాదవ్‌కు రెజ్లింగ్ అంటే చాలా ఇష్టం. తన కొడుకును పోలీసు లేదా ఆర్మీలో చేర్పించాలని అనుకున్నాడు. అయితే ఉమేశ్ క్రికెటర్‌గా కెరీర్ మొదలుపెట్టాడు. రంజీ క్రికెట్‌లో సూపర్ పర్ఫామెన్స్ తరువాత ఉమేశ్‌‌కు భారత జట్టులో అవకాశం దక్కింది. 2010లో ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ వేలంలో కొనుగోలు చేసింది. విదర్భ తరఫున టెస్టులు ఆడిన తొలి క్రికెటర్‌గా ఈ స్పీడ్ స్టార్ రికార్డు సృష్టించాడు. 


ఉమేష్ యాదవ్ కూడా మొదట తన తండ్రి కలను నెరవేర్చడానికి ప్రయత్నించాడు. కానీ అలా జరగలేదు. వివిధ టోర్నమెంట్ల కోసం విదర్భ క్రికెట్ జట్టులో చేరాడు. తన విధ్వంసకర బంతులతో బ్యాట్స్‌మెన్‌ను బెంబెలేత్తించాడు. దీంతో 2010లో జింబాబ్వే పర్యటనలో వన్డేల్లో అరంగేట్రం చేసే అవకాశాన్ని  దక్కించుకున్నాడు. ఒక సంవత్సరం తర్వాత నవంబర్ 2011లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో ఉమేశ్‌ అరంగేట్రం చేశాడు. 2012లో శ్రీలంకపై తన టీ20 అంతర్జాతీయ కెరీర్‌లో మొదటి మ్యాచ్ ఆడాడు. ఇప్పటివరకు మొత్తం 54 టెస్టుల్లో 165 వికెట్లు, 75 వన్డేల్లో 106 వికెట్లు, 9 టీ20ల్లో 12 వికెట్లు తీశాడు. గతేడాది డిసెంబర్‌లో మిర్పూర్‌లో బంగ్లాదేశ్‌తో చివరి టెస్టు ఆడాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ కోసం టీమిండియా జట్టులో ఉమేశ్ యాదవ్ ఉన్నాడు. 


తిలక్ యాదవ్ ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాకు చెందిన వ్యక్తి. తిలక్‌కి ఇద్దరు పెద్ద కుమార్తెలు, ఒక కుమారుడు ఉమేశ్‌ ఉన్నారు. బొగ్గు గనిలో ఉద్యోగం రావడంతో నాగ్‌పూర్‌ సమీపంలోని ఖపర్‌ఖేడీకి వచ్చి వలస వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. మొదట్లో ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎంతో కష్టపడి కొడుకు ఉమేశ్‌ను టీమిండియా క్రికెటర్‌గా తీర్చిదిద్దారు.


Also Read: Earthquak Today: ఢిల్లీ, చెన్నై నగరాల్లో భూకంపం.. భయాందోళనలో ప్రజలు  


Also Read: China Earthquake: చైనా సరిహద్దుల్లో భారీ భూకంపం.. భయాందోళనలో ప్రజలు  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి