Earthquake in China and Tajikistan: వరుస భూకంపాలు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. సిరియా, టర్కీలో భూకంపం విషాదం నుంచి ఇంకా తేరుకోకముందే గురువారం ఉదయం చైనా, తజికిస్థాన్ సరిహద్దులో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రతను రిక్టారు స్కేలుపై 7.2గా గుర్తించారు. తూర్పు తజికిస్థాన్‌లో 6.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. చైనా భూకంప నెట్‌వర్క్ సెంటర్ (సీఈఎన్‌సీ) ఉయ్‌గర్ అటానమస్ రీజియన్‌లో భూకంపాన్ని ధృవీకరించగా.. యూఎస్ జియోలాజికల్ సర్వే తజికిస్థాన్‌లో ఈ ప్రకంపనల గురించి వివరాలు వెల్లడించింది.
తజికిస్తాన్‌లో భూకంపం సంభవించిన ప్రాంతం చుట్టూ భారీ పామీర్ పర్వత శిఖరాలు ఉన్నట్లు యూఎస్‌జీఎస్ అంచనా వేసింది. ఆ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడవచ్చని చెబుతోంది. అయితే ఇక్కడ జనాభా చాలా తక్కువగా ఉండడంతో ప్రాణ, ఆస్తి నష్టం తక్కువగా ఉండే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పటివరకు చైనా పరిస్థితిపై ఎలాంటి స్పష్టమైన సమాచారం వెల్లడికాలేదు.
ఇటీవల టర్కీ, సిరియా దేశాలల్లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. టర్కీలో 41,020 మంది మరణించగా.. సియాలో మొత్తం 5,800 మంది మృతిచెందారు. ఈ విపత్తు కారణంగా దాదాపు 46,820 మంది మరణించారు. తీవ్రంగా గాయపడిన వారు ఇంకా చికిత్స పొందుతుండడంతో మృతుల సంఖ్య 50 వేలకు పైగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఇక భారత్‌లోనూ భారీ భూకంపాలు సంభవిస్తాయని జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌జీఆర్‌ఐ) చీఫ్ సైంటిస్ట్ డా.పూర్ణచందర్ రావు హెచ్చరించిన మరుసటి రోజే ఢిల్లీ, చెన్నై నగరాల్లో మంగళవారం భూమి కంపించింది. బుధవారం మధ్యాహ్నం 1.30 సమయంలో రిక్టర్ స్కేలుపై 4.4 తీవ్రతతో ఢిల్లీలో భూకంపం నమోదైంది. భూకంప కేంద్రం ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్‌కు తూర్పున 143 కి.మీ. దూరంలో.. భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. చెన్నై అన్నారోడ్డు సమీపంలోని వైట్స్ రోడ్ ప్రాంతంలో స్వల్పంగా భూమి కంపించింది. మూడంతస్తుల భవనంలో ప్రకంపనలు రావడంతో ఉద్యోగులు, ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ రెండు ఘటనల్లో ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
భారత్ భూమి పొరల్లో ఉండే ప్లేట్లు నిరంతరం కదులుతాయని ఎన్‌జీఆర్‌ఐ చీఫ్ సైంటిస్ట్ డా.పూర్ణచందర్ రావు తెలిపారు. ఈ ప్లేట్లు సంవత్సరానికి 5 సెంటీమీటర్లు వేగంతో కదులుతుండడంతో హిమాలయాలపై ఒత్తిడి పెరిగుతోందన్నారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు.
Also Read: Earthquak Today: ఢిల్లీ, చెన్నై నగరాల్లో భూకంపం.. భయాందోళనలో ప్రజలు
Also Read: Deepak Chahar: సీఎస్‌కే ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఐపీఎల్‌కు దీపక్ చాహర్ రెడీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి