India vs Sri Lanka T20 Series: శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో భారత్ విజయంతో 2-1 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. దీంతో 2023 సంవత్సరాన్ని టీమిండియా ఘనంగా ఆరంభించింది. హార్దిక్ పాండ్యా సారథ్యంలో భారత్ మూడో మ్యాచ్‌లో శ్రీలంకను 91 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి భారత జట్టు సరికొత్త రికార్డు సృష్టించింది. పాక్‌ను వెనక్కి నెట్టి భారత్ ఇంగ్లండ్‌ను సమం చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మూడో టీ20 మ్యాచ్‌లో విజయంతో శ్రీలంకతో జరిగిన మొత్తం 19వ టీ20లో భారత్ విజయం సాధించింది. ఏదైనా ఒక ప్రత్యర్థి జట్టుపై విజయాల సంఖ్య ఇదే అత్యధికం. పాకిస్థాన్ రికార్డును బద్దలు కొట్టిన భారత్.. ఇంగ్లండ్ రికార్డును సమం చేసింది. ఇంగ్లండ్ జట్టు పాకిస్థాన్‌తో ఆడిన 29 టీ20 మ్యాచ్‌ల్లో 19 విజయాలు సాధించింది. న్యూజిలాండ్‌పై పాకిస్థాన్ 18 మ్యాచ్‌లు గెలిచింది. 


టీ20లో ప్రత్యర్థిపై అత్యధిక విజయాలు 


భారత్ -శ్రీలంకపై 19 విజయాలు (29 మ్యాచ్‌లు)
ఇంగ్లండ్ -పాకిస్థాన్‌పై 19 విజయాలు (29 మ్యాచ్‌లు)
పాకిస్థాన్ -న్యూజిలాండ్‌పై 18 విజయాలు (29 మ్యాచ్‌లు)
భారత్ -వెస్టిండీస్‌పై 17 విజయాలు (25 మ్యాచ్‌లు)


శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత జట్టు 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండో టీ20లో మ్యాచ్‌లో భారత్ 16 పరుగుల తేడాతో ఓడిపోయింది. నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌లో భారత్ అన్ని విభాగాల్లో ఆకట్టుకుంది. దీంతో 91 పరుగుల తేడాతో విజయం సాధించి.. 2-1తో సిరీస్‌ని కైవసం చేసుకుంది. మూడో మ్యాచ్‌లో భారత్‌ తరఫున సూర్యకుమార్‌ యాదవ్‌ సెంచరీతో చెలరేగాడు. 



Also Read: Director Surender Reddy: షూటింగ్‌లో గాయపడిన డైరెక్టర్ సురేందర్ రెడ్డి.. నొప్పిని సైతం లెక్కచేయకుండా..  


Also Read: India vs Sri Lanka: రాజ్‌కోట్‌లో సూర్య సునామీ.. బౌలర్ల మెరుపులు.. శ్రీలంక చిత్తు  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook