Virat Kohli career: విరాట్ కోహ్లీ కెరీర్లో ఎన్నో అవరోధాలు.. మరెన్నో రివార్డులు
Virat Kohli career: టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రికెట్ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఎదురయ్యాయి. ఎన్నో అవరోధాలు, మరెన్నో రివార్డులు అందుకున్నాడు. టీమ్ ఇండియా క్రికెట్‌లో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టిన విరాట్ కోహ్లీ కెరీర్ గురించి ఓసారి చూద్దాం.
Virat Kohli career: టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రికెట్ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఎదురయ్యాయి. ఎన్నో అవరోధాలు, మరెన్నో రివార్డులు అందుకున్నాడు. టీమ్ ఇండియా క్రికెట్‌లో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టిన విరాట్ కోహ్లీ కెరీర్ గురించి ఓసారి చూద్దాం.
2014-15 ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన టీమ్ ఇండియా క్రికెటర్ విరాట్ కోహ్లి..ఇక వెనుదిరిగి చూసుకోలేదు. అన్ని ఫార్మట్ క్రికెట్‌లో టీమ్ ఇండియాకు సారధ్యం వహించాడు. నెమ్మదిగా ఒక్కొక్క ఫార్మట్ బాధ్యతల్నించి వైదొలిగాడు ఇప్పుడు.
టీమ్ ఇండియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లి (Virat Kohli)టెస్ట్ క్రికెట్ కోసం గతలో ఏ కెప్టెన్ చేయనంత మెరుగ్గా బేసిక్ ప్రిన్సిపల్‌ను ప్రవేశపెట్టాడు. బ్యాటింగ్ లైనప్‌తో పాటు 5గురు ప్రధాన బౌలర్లు ఉండాలనేది విరాట్ కోహ్లి ఆలోచనగా సాగింది. 2015లో శ్రీలంక పర్యటనలో కోహ్లీ ఐదుగురు బౌలర్లను రంగంలో దింపాడు. వాస్తవానికి ఇదేమీ కొత్త కాదు. రవిశాస్త్రి, కపిల్ దేవ్, మనోజ్ ప్రభాకర్‌లు కూడా గతంలో ఐదుగురు బౌలర్లుగా రంగంలో దిగిన పరిస్థితి ఉంది. అప్పటి నుంచి టీమ్ ఇండియాలో ఆరుగురు బ్యాట్స్‌మెన్, ఒక వికెట్ కీపర్, నలుగురు బౌలర్లు ఉండేవారు. విరాట్ కోహ్లీ ఈ పరిస్థితిని మార్చాడు.
2018 నాటికి టీమ్ ఇండియా(Team India)పాండ్యాతో పాటు నలుగురు బౌలర్లను కలిగి ఉంది. ఒక టెస్ట్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఐదుగురు పేసర్లను రంగంలో దింపింది. వెస్ట్ ఇండీస్ టీమ్ గతంలో అంటే 1970-1990 మధ్య కాలంలో ఇలాగే చేసేది. ఇలా పలు మార్పులతో కొన్నిసార్లు విమర్శలు ఎదుర్కొన్నా..ఎక్కువసార్లు ప్రశంసలు అందుకున్నాడు.టీమ్ ఇండియా సారధిగా అద్భుతమైన విజయాల్ని నమోదు చేయగలిగాడు. ఎన్ని విజయాలు నమోదు చేసినా..విమర్శలు కూడా ఓ వైపు వస్తూనే ఉన్నాయి. ఏది ఏమైనా సరే..ఎన్ని అవరోధాలు ఎదుర్కొన్నా..టీమ్ ఇండియాకు ఎక్కువ విజయాలు అందించిన కెప్టెన్ మాత్రం విరాట్ కోహ్లీనే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook