Virat Kohli: టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆందోళనకు లోనవుతున్నాడా
Virat Kohli: టీమ్ ఇండియా మాజీ రధ సారధి విరాట్ కోహ్లీ అంతర్గత ఆందోళలో ఉన్నాడా..మరెందుకు రాణించలేకపోతున్నాడు. విరాట్ కోహ్లీ తన అసలైన ఇన్నింగ్స్‌ను ఎప్పుడు ప్రదర్శిస్తాడు. ఇవే ప్రశ్నలిప్పుడు వస్తున్నాయి.
Virat Kohli: టీమ్ ఇండియా మాజీ రధ సారధి విరాట్ కోహ్లీ అంతర్గత ఆందోళలో ఉన్నాడా..మరెందుకు రాణించలేకపోతున్నాడు. విరాట్ కోహ్లీ తన అసలైన ఇన్నింగ్స్‌ను ఎప్పుడు ప్రదర్శిస్తాడు. ఇవే ప్రశ్నలిప్పుడు వస్తున్నాయి.
టీమ్ ఇండియా వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తప్పించిన తరువాత విరాట్ కోహ్లీ ఒక్కొక్కటిగా అన్ని క్రికెట్ ఫార్మట్ సారధ్యం నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం ఓ సాధారణ ఆటగాడిగా ఉన్నాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమ్ ఇండియా ఇప్పటికే రెండు పర్యటనలు సాగాయి. దక్షిణాఫ్రికా పర్యటనలో పరాభవం మూటగట్టుకోగా, వెస్టిండీస్ పర్యటనలో విజయ దుందుభి మోగిస్తోంది. వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమ్ ఇండియా ఇప్పుడు టీ20 సిరీస్‌పై కన్నేసింది. ఇప్పటికే తొలి టీ20 మ్యాచ్‌లో విజయం సాధించింది. విశేషమేమంటే..వెస్టిండీస్ నుంచి ఏ దశలో కూడా టీమ్ ఇండియాకు పోటీ ఎదురుకాలేదు. ఇవాళ ఈడెన్ గార్డెన్స్‌లో రెండు జట్ల మధ్య రెండవ టీ 20 మ్యాచ్ జరగనుంది.
ఫామ్ పరంగా చూస్తే టీమ్ ఇండియా పూర్తిగా ఆధిక్యం కనబర్చే అవకాశం స్పష్టంగా కన్పిస్తోంది. టీ20 ఫార్మట్‌లో హిట్టర్లున్నా సరే..వెస్టండీస్ ప్రభావం చూపించలేకపోయింది. వన్డే సిరీస్ కోల్పోవడం, టీ20 తొలి మ్యాచ్‌లో పరాభవం వెస్టిండీస్ ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీసిందనే చెప్పాలి. ఇక టీమ్ ఇండియా (Team India)విషయంలో జట్టులో మార్పులు ఉండకపోవచ్చు. ఎందుకంటే విరాట్ కోహ్లీ తప్ప..దాదాపు అందరూ ఫామ్‌లో ఉన్నారు. గెలిచిన జట్టునే కొనసాగించడమనేది టీమ్ ఇండియా రథ సారధి రోహిత్ శర్మ అలవాటు. ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్ దృష్టిలో ఉంచుకునే ప్రతి మ్యాచ్‌కు సన్నద్ధమవుతామనేది రోహిత్ శర్మ ఆలోచన. ఇందుకు తగ్గట్టుగానే తుది జట్టును ఎంపిక చేసుకున్నాడు. టీమ్ ఇండియాలో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, పంత్, సూర్యకుమార్, వెంకటేశ్ అయ్యర్‌లతో బ్యాటింగ్ లైనప్ ప్రస్తుతానికి పటిష్టంగా ఉంది.
ఇక విరాట్ కోహ్లీ(Virat Kohli) విషయానికొస్తే..గత కొద్దికాలంగా ఫామ్‌లో లేడు. వెస్టిండీస్‌తో జరిగిన మూడు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ మొత్తం నాలుగింటిలో వరుసగా 8, 18, 0, 17 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కెప్టెన్సీ బాధ్యతలు లేనప్పటి నుంచి విరాట్ కోహ్లీ ఎందుకో ఏదో తెలియని ఒత్డిడి లేదా ఆందోళనకు లోనవుతున్నాడని తెలుస్తోంది. వాస్తవానికి విరాట్ కోహ్లీ ఫామ్‌లో రావడమనేది పెద్ద కష్టమేం కాదు. ఒకే ఒక ఇన్నింగ్స్‌తో తన ఫామ్ కొనసాగించగలడని ఎన్నో సార్లు రుజువు చేశాడు. బహుశా అందుకే అభిమానులు ఎప్పుడూ అతనిపై ఆశ పెట్టుకునే ఉంటారు. అటు జట్టు కూడా విరాట్ కోహ్లీపై నమ్మకాన్ని ఉంచుతుంటుంది. కోల్పోయిన ఫామ్..తిరిగి ఎప్పుడు వస్తుందనేది ఆసక్తిగా మారింది. ఒక్కసారి విరాట్ కోహ్లీ ఫామ్‌లో వస్తే..ఇక అతని బ్యాట్‌కు తిరుగుండదనేది అందరికీ తెలిసిందే.
ఇక టీమ్ ఇండియా స్పిన్నర్ల విషయంలో చహల్, రవి బిష్ణోయ్‌లు ప్రతిభ చూపించారు. పేసర్లు ముగ్గురూ ఒకే వేగంతో బౌలింగ్ చేస్తుండటంతో మార్పుకు అవకాశముంది. అదే జరిగితే దీపక్ చహర్ లేదా భువనేశ్వర్ స్థానంలో సిరాజ్ ఎంపిక కావచ్చు. ఏదేమైనా టీమ్ ఇండియా మాజీ రథ సారధి విరాట్ కోహ్లీ బ్యాట్ ఈసారైనా ఝులిపిస్తాడా లేదా అనేది ఆసక్తిగా మారింది.
Also read: Shreyas Iyer: టీమ్ ఇండియాలో శ్రేయస్ అయ్యర్‌కు తిరిగి చోటు లభించడం కష్టమేనా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook