Virat Kohli: టీమ్ ఇండియా మాజీ సారధి విరాట్ కోహ్లీ గురించి సోషల్ మీడియాలో ఒక ట్వీట్ వైరల్ అవుతోంది. కోహ్లీను టెస్ట్ జట్టు నుంచి తొలగించాలంటూ ఓ మాజీ క్రికెటర్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీమ్ ఇండియా మాజీ రథ సారధి విరాట్ కోహ్లి మరోసారి చర్చనీయాంశమవుతున్నాడు. విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్‌లో ప్రవేశించి 11 ఏళ్లు పూర్తయ్యాయి. కెప్టెన్‌గా , ఆటగాడిగా సఫలీకృతుడయ్యాడు. అయితే ఈ మధ్యన అతని ఆటతీరు కారణంగా సోషల్ మీడియాలో అతనిపై వచ్చిన ఒక ట్వీట్ వైరల్ అవుతోంది. ఈ ట్వీట్‌లో ఓ మాజీ, దిగ్గజ క్రికెటర్ కోహ్లీని ఏకంగా టెస్ట్ టీమ్ నుంచి బయటకు పంపించాలంటున్నాడు.


విరాట్ కోహ్లీ 2011లో వెస్ట్ ఇండీస్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌తో టెస్ట్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత ఏడాది 2012 పర్యటన అంతా కష్టంగానే సాగింది. ఆ సమయంలో టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కూడా సందేహాలు వ్యక్తం చేశాడు. పదేళ్ల క్రితం చేసిన ఆ వ్యాఖ్య ఇప్పుడు మరోసారి వైరల్ అవుతోంది.



పదేళ్ల క్రితం ఇండియన్ టెస్ట్ టీమ్‌లో రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్, గౌతమ్ గంభీర్ వంటి దిగ్గజాలాడేవారు. జనవరి 6, 2022న సంజయ్ మంజ్రేకర్ చేసిన ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ ట్వీట్‌లో..నేను ఇప్పుడు కూడా వీవీఎస్ లక్ష్మణ్‌ను డ్రాప్ చేసి రోహిత్ శర్మను వచ్చే టెస్ట్‌లో తీసుకుంటాను. దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా ఇది ప్రయోజనకరం. విరాట్ కోహ్లికు మరో టెస్ట్ అవకాశమివ్వండి. అది కూడా విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ ఆడలేరనే విషయాన్ని ధృవీకరించుకునేందుకే.


విరాట్ కోహ్లీకు తొలిసారిగా 2011లో వైట్ జెర్సీలో ఆడేందుకు అవకాశమొచ్చింది. ఇప్పటివరకూ టీమ్ ఇండియాకు 101 టెస్ట్ మ్యాచ్‌లు ఆడారు. కోహ్లీ టెస్ట్ కెరీర్‌లో 7 డబుల్ సెంచరీలు, 27 సెంచరీలు, 28 హాఫ్ సెంచరీలున్నాయి. మొత్తం 8 వేల 43 పరుగులు సాధించాడు. విరాట్ టెస్ట్ క్రికెట్‌లో కూడా మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా నిలిచాడు.


Also read: Ranji Trophy 2022: సచిన్‌ సర్‌తో పాటు నా పేరు కూడా ఉండడం బాగుంది: యువ క్రికెటర్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook