న్యూజిలాండ్ గడ్డపై ఇవాళ ప్రారంభమైన తొలి వన్డేలో టీమ్ ఇండియా పరాజయం పాలైనా..టీమ్ ఇండియా ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ మాత్రం విజృంభించేశాడు. నిప్పులు చెరిగే బంతులతో చెలరేగిపోయాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీమ్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య టీ20 ముగిసింది. ఇవాళ తొలి వన్డే మ్యాచ్ జరిగింది. తొలి వన్డేలో న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో ఇండియాను ఓడించింది. కానీ ఈ మ్యాచ్‌తో టీమ్ ఇండియాలో ఎంట్రీ ఇచ్చిన జమ్ము కశ్మీర్ యువ పేసర్, సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ అద్భుత పేస్ ప్రదర్శించాడు. న్యూజిలాండ్ గడ్డపై గంటకు 153.1 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరాడు. వేగంగా దూసుకొస్తున్న ఉమ్రాన్ బంతుల్ని ఎదుర్కోలేక న్యూజిలాండ్ టాప్ ఆర్డర్ బ్యాటర్లు తడబడ్డారు. 


టీ20లో ఉమ్రాన్ మాలిక్‌కు అవకాశం లభించలేదు. అయితే తొలి వన్డేలో అవకాశం లభించగానే కసిగా బౌల్ చేస్తూ చెలరేగిపోయాడు. తొలి ఓవర్‌లోనే 150 కిలోమీటర్ల మార్క్ అందుకున్నాడు. మూడవ ఓవర్‌లో 153.1 కిలోమీటర్ వేగంతో బంతి  విసిరి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఉమ్రాన్ మాలిక్ ఈ మ్యాచ్‌లో 10 ఓవర్ల బౌల్ చేసి 2 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో అర్షదీప్ సింగ్ విఫలమయ్యాడు.


Also read: IND vs NZ: భారత్ ఔట్ డేటేడ్ టీమ్.. మైఖేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook