Virat Kohli: నయా లుక్‌లో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ..ఫోటోలు వైరల్..!
Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా మరోసారి హాట్ టాపిక్‌గా మారాడు.
Virat Kohli: భారత మాజీ కెప్టెన్, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ న్యూ లుక్‌తో అదరహో అనిపిస్తున్నాడు. కొత్త హెయిర్ స్టైల్‌లో కనిపించాడు. అతడి న్యూ లుక్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇందుకు సంబంధించిన పలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు. కోహ్లీకి సెలెబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ రషీద్ సల్మానీ కొత్త హెయిర్ స్టైల్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు.
కోహ్లీ చాలా అందంగా ఉన్నాడని..మరింత స్టైలిష్‌గా కనిపిస్తున్నాడని..నెటిజన్లు, అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఆస్ట్రేలియాతో మూడు టీ20 సిరీస్ కోసం విరాట్ కోహ్లీ మొహాలీ చేరుకున్నాడు. ఈనెల 20న భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఏర్పాట్లను పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ పూర్తి చేసింది. మొహాలీ ఎయిర్‌పోర్టులో విరాట్ కోహ్లీ విజువల్స్ వైరల్‌గా మారాయి. ఈదృశ్యలను పీసీఏ తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసింది.
ఇటీవల ముగిసిన ఆసియా కప్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టచ్‌లోకి వచ్చాడు. టోర్నీలో సెంచరీతోపాటు పలు కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. దాదాపు వెయ్యి రోజుల తర్వాత 71వ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. ఐదు మ్యాచ్‌ల్లో 276 పరుగులు చేసి..ఆసియా కప్‌లోనే అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా ఉన్నాడు.
Also read:China Accident: చైనాలో మరోసారి రోడ్‌టెర్రర్..27 మంది మృతి, మరో 20 మందికి గాయాలు..!
Also read:Team India: కేఎల్ రాహుల్‌ను తక్కువ అంచనా వేయొద్దు..టీమిండియా మాజీ ఓపెనర్ కీలక వ్యాఖ్యలు..!
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి