Team India: కేఎల్ రాహుల్‌ను తక్కువ అంచనా వేయొద్దు..టీమిండియా మాజీ ఓపెనర్ కీలక వ్యాఖ్యలు..!

Team India: టీ20 ప్రపంచ కప్‌ సమయం దగ్గరపడుతోంది. ఈసారి ఎలాగైనా ఛాంపియన్‌గా నిలవాలని టీమిండియా ముమ్మర సాధన చేస్తోంది. ఈక్రమంలో భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

Written by - Alla Swamy | Last Updated : Sep 18, 2022, 04:06 PM IST
  • టీ20 ప్రపంచ కప్‌నకు కౌంట్ డౌన్
  • 20 నుంచి టీ20 సిరీస్‌ ప్రారంభం
  • గంభీర్ కీలక వ్యాఖ్యలు
Team India: కేఎల్ రాహుల్‌ను తక్కువ అంచనా వేయొద్దు..టీమిండియా మాజీ ఓపెనర్ కీలక వ్యాఖ్యలు..!

Team India: భారత కీలక ఆటగాళ్లకు టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ పలు సూచనలు చేశాడు. వ్యక్తిగత మైలు రాళ్లపై దృష్టి పెట్టకుండా జట్టు కోసం దృష్టి పెట్టాలన్నాడు. జట్టులో ఎవరో ఒకరు మంచి ఆరంభం ఇవ్వాలని..దానిని మిగతావారు కొనసాగించాలని పిలుపునిచ్చాడు. జట్టుగా విజయాలపై ఫోకస్ చేయాలన్నాడు. వ్యక్తిగత ప్రదర్శనలకు పరిమితం కాకూడదని తెలిపాడు. ఆసియా కప్‌లో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీతోపాటు పలు కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడని గుర్తు చేశాడు.

ఈక్రమంలోనే అతడు ఓపెనర్‌గా రావాలన్న చర్చ తెరపైకి వచ్చిందన్నాడు. గతకొంతకాలంగా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఆట గాడి తప్పినట్లు కనిపిస్తోందని చెప్పాడు. ఐనా ఇలాంటి వాటిని టాప్ ఆటగాళ్లు పట్టించుకోకూడదని..ఒత్తిడికి గురి కాకూడదన్నాడు. కేఎల్ రాహుల్ వంటి ఆటగాడు భారత్‌కు అవసరమని..అతడిని తక్కువ అంచనా వేయొద్దన్నాడు గౌతమ్ గంభీర్. రోహిత్ శర్మ, కోహ్లీ కంటే కేఎల్ రాహుల్‌లోనే నైపుణ్యం ఉందని స్పష్టం చేశారు. 

అతడి ప్రదర్శనను అంతర్జాతీయ క్రికెట్‌తోపాటు ఐపీఎల్‌ చూశామని..దీనిని మనం వ్యక్తిగత ప్రదర్శనలా కాకుండా టీమిండియా కోణంలో చూడాలన్నాడు. మరోవైపు కోహ్లీ ఓపెనర్‌గా రావాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఆసీస్ మాజీ ప్లేయర్ మ్యాథ్యూ హేడెన్ సైతం ఇదే స్పష్టం చేశాడు. విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా వస్తేనే బాగుంటుందని తెలిపాడు. ఆస్ట్రేలియాలోని ఫాస్ట్ పిచ్‌లపై అతడు బాగా ఆడతాడని..గతంలో చాలా సార్లు ఇదే రుజువయ్యిందన్నాడు.

త్వరలో ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్ కప్ ప్రారంభంకానుంది. అంతకంటే ముందు సొంత గడ్డపై ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లతో టీమిండియా తలపడనుంది. ఈనెల 20 నుంచి భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు టీ20 సిరీస్‌ ప్రారంభంకానుంది. ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ జరగనుంది. ఇప్పటికే భారత జట్టును బీసీసీఐ సెలెక్టర్ ప్రకటించారు. గాయం కారణంగా జట్టుకు దూరమైన స్టార్ ప్లేయర్లు బుమ్రా, హర్షల్ పటేల్ రీ ఎంట్రీ ఇవ్వనున్నారు.

రెండు సిరీస్‌లు పూర్తి కాగానే భారత జట్టు ఆస్ట్రేలియా వెళ్లనుంది. అక్కడ టీ20 వరల్డ్ కప్‌ జరగనుంది. ఇప్పటికే 15 మందితో కూడిన జట్టును బీసీసీఐ వెల్లడించింది. గాయం కారణంగా భారత స్టార్ ఆల్‌రౌండర్ జడేజా జట్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో అక్షర్‌ పటేల్‌ ఎంపికయ్యాడు.

Also read:SBI: ఇకపై ఎస్‌ఎంఎస్‌ ఛార్జీలు ఉండవు..ఖాతాదారులకు ఎస్‌బీఐ గుడ్‌న్యూస్..!

Also read:China Accident: చైనాలో మరోసారి రోడ్‌టెర్రర్..27 మంది మృతి, మరో 20 మందికి గాయాలు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News