Gautam Gambhir: టీమ్ ఇండియాలో గౌతమ్ గంభీర్ స్థానం ప్రత్యేకమనే చెప్పాలి. క్రికెట్‌లో కొనసాగింది తక్కువ కాలమే అయినా రాజకీయాల్లో చేరి టికెట్ తెచ్చుకుని భారీ మెజార్టీతో పార్లమెంట్ లో అడుగుపెట్టాడు. ఎప్పుడూ వివాదాస్పదంగా లేదా సంచలన వ్యాఖ్యలతో ముందుండే గౌతమ్ గంభీర్ ఒక్కసారిగా ఇప్పుడు అస్త్ర సన్యాసం చేశాడు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2019 ఎన్నికల సమయంలో క్రికెట్ నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించిన గౌతమ్ గంభీర్ బీజేపీలో చేరాడు. ఇలా పార్టీలో చేరాడో లేదో గానీ తూర్పు ఢిల్లీ లోక్‌సభ టికెట్ సంపాదించుకున్నాడు. దాదాపు 7 లక్షల ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించాడు. ఎంపీగా ఎన్నికయ్యాక క్రికెట్‌లో సెకండ్ ఇన్నింగ్స్ మరో అవతారంతో ప్రారంభించాడు. ఎంపీగా కంటే క్రికెటర్‌గానే ఎక్కువ కాలం గడిపాడు. క్రికెట్ కామెంటేటర్‌గా , ఐపీఎల్ మెంటార్‌గా కొనసాగాడు. 2023 ఐపీఎల్ సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా వ్యవహరించిన గౌతమ్ గంభీర్..రానున్న ఐపీఎల్ కోసం సొంతగూటికి అంటే కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు వచ్చేశాడు. 


కానీ ఇప్పుడు ఒక్కసారిగా రాజకీయాలకు స్వస్తి చెబుతున్నట్టు ప్రకటించాడు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, క్రికెట్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందున రాజకీయల బాధ్యతల్నించి తప్పించాలంటూ బీజేపీ అధిష్టానానికి విజ్ఞప్తి చేశాడు. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కోరుతూ ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. ఇన్నాళ్లూ దేశ ప్రజలకు సేవచేసే అదృష్టం కల్పించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాకు కృతజ్ఞతలు తెలుపుతూ జై హింద్ అని ముగించాడు. 


కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలో వస్తుందని భావిస్తున్న తరుణంలో గౌతమ్ గంభీర్ రాజకీయాల్నించి తప్పుకోవడంపై చాలా ప్రశ్నలే విన్పిస్తున్నాయి. క్రికెట్‌లో బిజీగా ఉన్నందునే రాజకీయాల్నించి తప్పుకుంటున్నాననడంలో వాస్తవం లేదంటున్నారు పలువురు విశ్లేషకులు. వాస్తవానికి రానున్న ఎన్నికల్లో గౌతమ్ గంభీర్‌కు టికెట్ కేటాయించే పరిస్థితి లేదని తెలుస్తోంది. బీజేపీ తొలి జాబితా రూపకల్పనపై ఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసంలో జరిగిన భేటీలో ఈసారి గౌతమ్ గంభీర్‌కు టికెట్ లేదనే చర్చ జరిగినట్టు సమాచారం. అందుకే ఇది దృష్టిలో ఉంచుకునే రాజకీయాల్నించి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించాడని తెలుస్తోంది. 


Also read: Anant Ambani: అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్‌లో స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా ధోనీ దంపతులు, పిక్స్ వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook