Vijay Zol Arrest: కిడ్నాప్, బెదిరింపులు, అల్లర్ల కేసులో టీమిండియా అండర్ 19 మాజీ కెప్టేన్ అరెస్ట్
Vijay Zol Arrest: టీమిండియా అండర్ 19 మాజీ కెప్టేన్ విజయ్ జోల్ లీగల్ ట్రబుల్స్‌లో చిక్కుకున్నాడు. విజయ్ జోల్‌తో పాటు అతడి సోదరుడు విక్రమ్ జోల్ మరో 20 మందితో కలిసి తనను కిడ్నాప్ చేసి బెదిరింపులకు, అల్లర్లకు పాల్పడినట్టుగా ఆరోపిస్తూ క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్ మహారాష్ట్రలోని ఔరంగబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Vijay Zol Arrest: టీమిండియా అండర్ 19 మాజీ కెప్టేన్ విజయ్ జోల్ లీగల్ ట్రబుల్స్‌లో చిక్కుకున్నాడు. విజయ్ జోల్‌తో పాటు అతడి సోదరుడు విక్రమ్ జోల్ మరో 20 మందితో కలిసి తనను కిడ్నాప్ చేసి బెదిరింపులకు, అల్లర్లకు పాల్పడినట్టుగా ఆరోపిస్తూ క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్ మహారాష్ట్రలోని ఔరంగబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన ఔరంగబాద్ పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో మొత్తం 20 మందిపై ఎఫ్ఐఆర్ అయినట్టు సమాచారం.
విజయ్ జోల్‌పై అభియోగాలు..
విజయ్ జోల్, విక్రమ్ జోల్ ఇంకొంతమందితో కలిసి పూణెలోని తన ఇంటికి వచ్చి తనను కిడ్నాప్ చేశారని.. ఓ హోటల్లో 10 రోజుల పాటు బంధించి డబ్బులు ఇవ్వాల్సిందిగా బెదిరింపులకు పాల్పడ్డారని, తన ఇంటి వద్ద అల్లర్లకు పాల్పడ్డారని క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ఇదిలావుంటే, విజయ్ జోల్‌పై ఫిర్యాదు చేసిన క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్‌పై సైతం మరో వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఇన్వెస్ట్‌మెంట్ పేరిట సదరు ఫండ్ మేనేజర్ తమను లక్షల మేర మోసం చేశాడంటూ ఆ వ్యక్తి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్‌పై సైతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ మొత్తం వ్యవహారంపై రెండు వేర్వేరు ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయని.. కేసులు నమోదులు చేసి దర్యాప్తు చేపట్టామని జిల్లా ఎస్పీ ఆకాశ్ షిండె మీడియాకు తెలిపారు. ఇదే విషయమై విజయ్ జోల్ తండ్రి, సీనియర్ క్రిమినల్ లాయర్ విజయ్ జోల్ ని వివరణ కోరగా.. క్రిప్టోకరెన్సీ పేరుతో సదరు ఫండ్ మేనేజర్ భారీ మొత్తంలో డబ్బులు దండుకుని.. తిరిగి తమపైనే నిందలు మోపుతున్నారని అన్నారు.
ఇది కూడా చదవండి : Shubman Gill Century: విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ రికార్డు బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్.. అంతర్జాతీయ క్రికెట్‌లో రెండో బ్యాటర్!
ఇది కూడా చదవండి : Rohit Sharma Record: ఎంఎస్ ధోనీ అరుదైన రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ!
ఇది కూడా చదవండి : Uppal Stadium Match Tickets: ఉప్పల్ స్టేడియం టికెట్లు బ్లాక్‌లో అమ్ముతున్న వ్యక్తులు అరెస్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook