‘గంగూలీ పునాదితోనే MS Dhoniకి విజయాలు’
బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) కెప్టెన్‌గా అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి అని, టీమిండియాకు అతడు వేసిన పునాదులే అనంతరం మహేంద్ర సింగ్ ధోనీ అందించిన విజయాలకు బాటలు వేశాయని క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కర (Kumar Sangakkara) అభిప్రాయపడ్డాడు.
మాజీ కెప్టెన్లు సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni)ల పుట్టినరోజు జులై 8, జులై7 సందర్భంగా వీరిపై ఓటింగ్ నిర్వహించడం తెలిసిందే. ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) నాలుగు అంశాల్లో ధోనీని వెనక్కి నెట్టడం గమనార్హం. ఇంకా చెప్పాలంటే దాదా గంగూలీ అందించిన టీమ్ వల్లే ధోనీ అద్భుత విజయాలు సాధించాడని సైతం ఓటింగ్‌లో తేలింది. ఈఎస్‌పీఎన్ క్రిక్ఇన్ఫో నిర్వహించిన 8 అంశాల ఓటింగ్‌లో మేటి క్రికెటర్లు, మాజీ కెప్టెన్లు గ్రేమ్ స్మిత్, కుమార సంగక్కర, గౌతమ్ గంభీర్, ఇర్ఫాన్ పఠాన్, క్రిష్ణమాచారి శ్రీకాంత్ లాంటి వారు తమ అభిప్రాయాలను వెల్లడించారు. Gautam Gambhir: ధోనీపై మరోసారి విరుచుకుపడిన గౌతం గంభీర్
ఓవరాల్‌గా హాఫ్ పాయింట్ ఆధిక్యంతో గంగూలీని ధోనీ అధిగమించాడంటే పరిస్థితి ఏంటన్నది అర్థం చేసుకోవచ్చు. కెప్టెన్‌గా ధోనీ బ్యాటింగ్ అంశం ముఖ్యంగా వీరి మధ్య ఎక్కువ తారతమ్యం కనిపించేలా చేసింది. విదేశాలలో కెప్టెన్సీ, జట్టుపై కెప్టెన్ ప్రభావం, మేటి జట్టును తర్వాతి కెప్టెన్‌కు అందించడం, జట్టు విజయాలను తర్వాత సారథికి అప్పగించడం లాంటి అంశాల్లో గంగూలీ టాప్‌లో నిలిచాడు. వరల్డ్ కప్ నెగ్గిన తర్వాతే నా పెళ్లి
అయితే 2011 వన్డే ప్రపంచ కప్, 2007 టీ20 వరల్డ్ కప్, 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజయాలతో పాటు ధోనీ మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేసి చివరివరకు క్రీజులో నిలిచి జట్టు విజయాలలో పాలు పంచుకోవడం ధోనీకి ప్లస్ పాయింట్ అయిందని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. అయితే గంగూలీ క్రికెట్ కాలంలో ఆస్ట్రేలియా జట్టును ఏ జట్టు కూడా ఓడించే పరిస్థితి లేదని గమనించాలని లంక క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కర (Kumar Sangakkara)సూచించారు. వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్
యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, ఆశిష్ నెహ్రా లాంటి మ్యాచ్ విన్నర్లను జట్టుకు అందించిన ఘనత గంగూలీకి సొంతమని పేర్కొన్నాడు. గంగూలీ తయారుచేసిన జట్టుతోనే ఎంఎస్ ధోనీ అద్భుతాలు చేశాడని సంగక్కర అభిప్రాయపడ్డాడు. కొన్ని విజయాలు అందించకపోయినప్పటికీ, అందుకు కావాల్సిన వాతావరణాన్ని, జట్టును అందించిన గంగూలీని కచ్చితంగా ప్రశంసించాలన్నాడు. టెస్టుల్లో గంగూలీ అత్యుత్తమ క్రికెటర్, కెపప్టెన్ అని సంగక్కర, గ్రేమ్ స్మిత్ అభిప్రాయపడ్డారు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రం ఎంఎస్ ధోనీకి తమ ఓటు అని ఇద్దరూ పేర్కొన్నారు. RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..