వరల్డ్ కప్ నెగ్గిన తర్వాతే నా పెళ్లి: రషీద్ ఖాన్

అఫ్గానిస్థాన్ జట్టు తరఫున ప్రపంచ కప్ నెగ్గిన తర్వాతే తాను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు యువ సంచలనం రషీద్ ఖాన్ చెబుతున్నారు. పెళ్లి (Rashid Khan Wedding) కోసం పెద్ద కోరిక బయటపెట్టి క్రికెట్ అభిమానులకు షాకిచ్చాడు.

Shankar Dukanam Shankar Dukanam | Updated: Jul 12, 2020, 02:37 PM IST
వరల్డ్ కప్ నెగ్గిన తర్వాతే నా పెళ్లి: రషీద్ ఖాన్
PC: India.com

లాక్‌డౌన్ సమయాన్ని తమ వ్యక్తిగత జీవితానికి సెలబ్రిటీలు బాగా వినియోగించుకుంటున్నారు. టాలీవుడ్ సెలబ్రిటీలు నిశ్చితార్థం, పెళ్లి అంటూ లాక్‌డౌన్ టైమ్‌ను ఇట్టే గడిపేస్తున్నారు. క్రికెటర్లు తమ కుటుంబంతో చాన్నాళ్ల తర్వాత అధిక సమయం గడుపుతున్నారు. ఈ క్రమంలో యువ సంచలనం అఫ్గానిస్థాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ (Rashid Khan) తన పెళ్లి విషయంపై స్పందించాడు. తాను పెళ్లి ఎప్పుడు చేసుకోవాలనుకుంటున్నాడో చెప్పి క్రికెట్ అభిమానులకు పెద్ద షాకిచ్చాడు. భారత మాజీ క్రికెటర్‌కు కరోనా పాజిటివ్

ఆజాదీ రేడియోతో ఇంటర్వ్యూలో భాగంగా 21 ఏళ్ల అఫ్గానిస్థాన్(Afghanistan) ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ తన పెళ్లి విషయాన్ని ప్రస్తావించాడు. అఫ్గానిస్థాన్ ఓ వరల్డ్ కప్ నెగ్గిన తర్వాతే తన నిశ్చితార్థం, వివాహం (Rashid Khan Marriage) జరుగుతాయని పెద్ద కోరికనే బయటపెట్టాడు. టీ20లలో ఐసీసీ నెంబర్ వన్ బౌలర్‌గా రషీద్ ఖాన్ (749 పాయింట్లు) కొనసాగుతున్నాడు. రషీద్ ఖాన్ అఫ్గాన్ తరఫున 7 టెస్టులు, 67 వన్డేలు, 48 టీ20లలో ప్రాతినిథ్యం వహించాడు. ఎన్నో మ్యాచ్‌లను ఒంటిచేత్తో మలుపుతిప్పాడు. వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్

చివరగా ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో 5 వికెట్లు పడగొట్టాడు. ఆతిథ్య ఐర్లాండ్‌పై అఫ్గాన్ సిరీస్ కైవసం చేసుకుంది. ఐపీఎల్ విషయానికొస్తే రషీద్ ఖాన్.. సన్‌రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ జట్టుకు 2017 నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. తొలి సీజన్‌లోనే 17 వికెట్లు పడగొట్టి తన సత్తా చాటాడు యువ సంచలన రషీద్. కానీ పెళ్లి విషయం అడిగితే తమ జట్టు వరల్డ్ కప్ నెగ్గిన తర్వాత పెళ్లి (Rashid Khan Wedding) చేసుకోవాలనుకున్నట్లు చెబుతున్నాడు. RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..