T20 World Cup: టీ20 ప్రపంచకప్ 2021(T20 World Cup 2021)లో భాగంగా..ప్రస్తుతం టీమిండియా ఫామ్ చూస్తే...కచ్చితంగా టైటిల్ ఫేవరెట్ గానే చెప్పవచ్చు. మాజీ క్రికెటర్ల నుంచి విశ్లేషకుల వరకు ఛాంపియన్ గా నిలవడానికి భారత్(Teamindia)కే అవకాశాలు ఎక్కువని అభిప్రాయపడుతున్నారు. అయితే ఇంగ్లాండ్ మాజీ సారధి నాసర్ హుస్సేన్(Nasser Hussain) మాత్రం దీనికి భిన్నమైన విశ్లేషణ చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నాకౌట్‌ స్టేజ్‌ (సెమీఫైనల్స్‌)లో టీమిండియాను ఎవరైనా ఓడించే అవకాశం ఉందని పేర్కొన్నాడు. పొట్టి ఫార్మాట్‌లో ఏదైనా సాధ్యమేనని వ్యాఖ్యానించాడు. ‘‘టీ20 గేమ్‌లో ఎవరినీ ఫేవరేట్‌గా పరిగణించలేం. వ్యక్తిగత ప్రదర్శనే కీలకమవుతుంది. మూడే మూడు డెలివరీలతో ఒక్కసారిగా మ్యాచ్‌ స్వరూపమే మారిపోవచ్చు. అందుకే నాకౌట్‌లో ఎవరినీ తక్కువ అంచనా వేయలేం. అదే క్రమంలో ఏ జట్టైనా టీమిండియా(Teamindia)ను చిత్తు చేయొచ్చు’’ అని చెప్పుకొచ్చాడు. ఒకవేళ టాప్‌-ఆర్డర్‌ బ్యాటర్లు విఫలమైతే భారత్‌ జట్టు వద్ద ప్లాన్‌-బి(Team India have no Plan B) లేదని.. అదే మైనస్‌గా మారే అవకాశం ఉందని పేర్కొన్నాడు.


Also Read; T20 World Cup 2021: ఆ రెండు జట్లకే టైటిల్ గెలిచే అవకాశం ఎక్కువ: షేన్ వార్న్


‘‘గత వన్డే ప్రపంచకప్‌ను ఓసారి పరిశీలిస్తే.. చివరి వరకు న్యూజిలాండ్‌ అద్భుతంగా ఉంది. ప్లాన్‌-బి లేకపోవడంతో తక్కువ స్కోరింగ్‌ మ్యాచ్‌లోనూ తడబాటుకు గురైంది. అదే బాటలో ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌ బరిలోకి దిగుతున్న టీమిండియాకు కూడా ప్లాన్‌-బి లేదు. నాకౌట్‌(knockout gam)లో ప్రతి జట్టు శాయశక్తులా విజయం కోసం ఆడతాయి. ప్రతి ఒక్కరూ తామే గెలుస్తాం అని అనుకుంటూ ఉంటారు. అభిమానులు కూడా పేపర్‌ మీద టీం లైనప్‌ను చూసి తమ జట్టే గెలుస్తుందని అనుకోవడం సహజమే. టీమిండియా టాప్‌-ఆర్డర్‌ సరిగా ఆడనప్పుడు మిగతా టీం సభ్యులు ఎలా ఆడతారో వేచి చూడాలి’’ అని నాసర్‌ హుస్సేన్‌ విశ్లేషించాడు. టీ20 ప్రపంచకప్‌ వేటను భారత్‌ అక్టోబర్‌ 24న పాకిస్థాన్‌(Pakistan)తో పోరుతో ప్రారంభిస్తుంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook