Shikhar Dhawan: టీ20ల్లో రాకపోవడానికి ఏదో కారణం ఉంది..శిఖర్ ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
Shikhar Dhawan: టీ20లకు తనకు ఎంపిక చేయకపోవడంపై టీమిండియా వన్డే ఓపెనర్ శిఖర్ ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Shikhar Dhawan: భారత్ క్రికెట్ జట్టు ఓపెనర్ శిఖర్ ధావన్ పేరు తెలియని వారుండరు. ఎప్పటి నుంచో క్రికెట్ ఆడుతున్న అతడు..దిగ్గజాల రిటైర్మెంట్‌తో తెరపైకి వచ్చాడు. అప్పటి నుంచి టీమిండియా జట్టును ఓపెనర్‌గా సేవలందిస్తున్నాడు. ఐతే ఇటీవల టీ20లకు అతడు ఎంపిక కావడం లేదు. కేవలం వన్డేలకు మాత్రమే ఆడుతున్నాడు.
ఈసందర్భంగా ఓపెనర్, వెటరన్ ప్లేయర్ శిఖర్ ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20లకు ఎందుకు ఎంపిక చేయడం లేదో తనకు తెలియదని అన్నాడు. కేవలం తన పరిధిలోకి వచ్చే విషయాల గురించే మాట్లాడుతానని..ఇతర వాటిని పట్టించుకోనని స్పష్టం చేశాడు. ఆటలో ఎలా రాణించాలన్న దానిపైనే దృష్టి పెడతానని..మిగతా వాటి గురించి ఆలోచించనని తెలిపాడు.
ఐతే టీ20లకు ఎంపిక చేయకపోవడానికి ఏదో ఒక కారణం ఉంటుందని..కానీ దాని గురించి పట్టించుకోనని చెప్పాడు ధావన్. ఐతే వచ్చిన అవకాశాన్నిసద్వినియోగం చేసుకుంటానని..అది వన్డేలైనా, టీ20ల్లోనైనా అని స్పష్టం చేశాడు. ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రావిడ్, గత కోచ్ రవిశాస్త్రి వ్యవహార శైలి వేరు అని..ఇద్దరి పని తీరు పూర్తి విరుద్ధంగా ఉంటుందన్నాడు.
తనకు ఇద్దరితోనూ అనుబంధం ఉందని గుర్తు చేశాడు. ప్రస్తుతం రాహుల్ ద్రవిడ్‌తో పనిచేయడం సంతోషంగా ఉందన్నాడు. తనకు వన్డేలు, టీ20లు, టెస్ట్‌లు ఒక్కటేనని..ఆటను ఆస్వాదిస్తానని తెలిపాడు. ఇటీవల శిఖర్ ధావన్ వన్డేల్లో కీలకంగా మారాడు. టీమిండియా జూనియర్ జట్టుకు నాయకత్వ వహిస్తున్నాడు. అతడి సారధ్యంలో టీమిండియా సిరీస్‌లను కైవసం చేసుకుంది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టీ20ల హవా నడుస్తోంది. ఇటీవల వన్డే, టెస్ట్ సిరీస్‌ల కంటే టీ20 సిరీస్‌లే అధికంగా జరుగుతున్నాయి. త్వరలో ప్రారంభంకానున్న ఆసియా కప్ సైతం ఈసారి టీ20 ఫార్మాట్‌లో జరుగుతోంది. ఈఏడాది చివర్లో టీ20 వరల్డ్ కప్ జరగబోతోంది. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.
Also read:Raksha Bandhan Gifts Value: బాలీవుడ్ నటులు రక్షాబంధన్ ఎలా జరుపుకుంటారు
Also read:Raksha Bandhan: రక్షాబంధన్ సందర్భంగా మీ చేతులను గోరింటాకుతో అలంకరించుకోండి..డిజైన్లు ఇవే..!
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook