ICC Rankings: టెస్టు ర్యాంకింగ్స్ లో దుమ్మురేపిన టీమిండియా ఆటగాళ్లు.. కెరీర్ బెస్ట్ ర్యాంక్‌కు జైస్వాల్..
ICC Test Rankings: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో భారత ఆటగాళ్లు దుమ్మురేపుతున్నారు. యశస్వి కెరీర్ బెస్ట్ ర్యాంకును సాధించగా.. జడేజా, అశ్విన్, రోహిత్ తదితరులు తమ ర్యాంకులను మెరుగుపరుచుకున్నారు.
ICC Test Rankings Updates: ఇంగ్లండ్‌తో సిరీస్ లో దుమ్ముదులుపుతున్న టీమిండియా యువ సంచలనం యశస్వి జైస్వాల్ ఐసీసీ ర్యాంకింగ్స్ లోనూ సత్తా చాటాడు. ఇంగ్లండ్ పై వరుస టెస్టుల్లో డబుల్ సెంచరీలు సాధించడంతో జైస్వాల్.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో కెరీర్ బెస్ట్ ర్యాంకుకు చేరుకున్నాడు. 14వ స్థానాలు ఎగబాకి 15వ ర్యాంకుకు చేరుకున్నాడు. రాజ్‌కోట్ టెస్టుకు ముందు అతడు 29 ర్యాంకులో ఉన్నాడు. 699 పాయింట్లతో జస్వాల్ 15 ర్యాంకులో కొనసాగుతున్నాడు.
ఇక ఐసీసీ టెస్టు బ్యాటర్ ర్యాంకింగ్స్ లో టీమిండియా నుంచి విరాట్ కోహ్లీ ఒక్కడే టాప్-10లో చోటుదక్కించుకున్నాడు. అతడు 752 పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్ తో మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేయడంతో కెప్టెన్ రోహిత్ శర్మ ఒక స్థానం మెరుగుపరుచుకుని 12వ స్థానానికి చేరుకోగా, రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ మిస్ చేసుకున్న శుభ్‌మన్ గిల్ మూడు స్థానాలు ఎగబాకి 35వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్ మరియు ధ్రువ్ జురెల్ వరుసగా 75వ మరియు 100వ స్థానాల్లో కొనసాగుతున్నారు. రాజ్‌కోట్‌లో సెంచరీ చేసిన రవీంద్ర జడేజా.. 7 స్థానాలు ఎగబాకి 34వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఈ జాబితాలో కేన్ విలియమ్సన్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఆల్ రౌండర్ల ర్యాంకింగ్స్‌లో జడేజా తొలి స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.
Also Read: Anushka Baby Boy: 'బుల్లి విరాట్ కోహ్లీ' వచ్చేశాడు.. పుత్రోత్సాహంలో విరాట్ కోహ్లీ, అనుష్క.
ఇక బౌలింగ్ విషయానికొస్తే.. స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా టెస్టుల్లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. రాజ్ కోట్ టెస్టులో 500వ వికెట్ తీసిన రవిచంద్రన్ అశ్విన్ రబాడను వెనక్కి నెట్టి రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. బౌలర్ల ర్యాంకింగ్స్ లో జడేజా మూడు స్థానాలు మెరుగుపరుచుకుని ఆరో స్థానంలో నిలిచాడు. అంటే టాప్-10లో టీమిండియా నుంచి ముగ్గురు బౌలర్లు ఉండటం విశేషం.
Also Read: IPL 2024 Schedule: ఐపీఎల్ ప్రారంభంపై స్పష్టత.. అప్పటి నుంచే మొదలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook