Mohammad Siraj Record: లార్డ్స్ టెస్ట్ మ్యాచ్‌లో ఇండియా చరిత్రాత్మక విజయం సాధించమే కాదు..మరో రికార్డు కూడా దక్కింది. 39 ఏళ్ల తరువాత టీమ్ ఇండియా బౌలర్ సిరాజ్ సాధించిన గౌరవమది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లార్డ్స్‌లో జరిగిన ఇండియా-ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్‌లో(India-England Test Match)ఇండియా ఆతిధ్య జట్టుపై చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఓ దశలో డ్రా అయితే మంచిదనుకునే పరిస్థితి నుంచి అనూహ్యంగా పుంజుకుని..తెల్ల దొరలకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది ఇండియా. ఇండియా విజయంతో 5 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో ఇండియా 1-0 ఆధిక్యంతో నిలిచింది. అయితే ఇదే టెస్ట్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా పేస్ బౌలర్ మొహ్మద్ సిరాజ్ అరుదైన గౌరవం సాధించాడు. 39 ఏళ్లపాటున్న రికార్డును బద్దలు కొట్టాడు. అది కూడా ప్రముఖ క్రికెటర్, టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్(kapil Dev)పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు మొహ్మద్ సిరాజ్.


లార్డ్స్ టెస్ట్ మ్యాచ్‌(Lords Test Match)లో టీమ్ ఇండియా బౌలర్ మొహమ్మద్ సిరాజ్ రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 8 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు, రెండవ ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసుకున్నాడు. లార్డ్స్ టెస్ట్‌లో ఒక టీమ్ ఇండియా (Team india)బౌలర్ ఇన్ని వికెట్లు సాధించడం ఇది రెండవసారి. అంతకముందు అంటే 1982లో కపిల్ దేవ్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు, రెండవ ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు మొత్తం 8 వికెట్లు పడగొట్టాడు. కపిల్ దేవ్ తరువాత అంటే 39 ఏళ్ల అనంతరం ఆ ఘనత సాధించింది హైదరాబాదీ మొహమ్మద్ సిరాజ్(Mohammad Siraj) కావడం గర్వకారణం.


Also read; IND VS ENG: లార్డ్స్‌లో భారత్ సంచ‌ల‌న విజ‌యం..బుమ్రా, షమి మెరుపులు..సిరాజ్ సూపర్ బౌలింగ్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook