India vs Eng 2nd Test: : లార్డ్స్ టెస్టులో ఇంగ్లాండ్ కు దిమ్మతిరిగే షాకిచ్చింది టీమిండియా. మ్యాచ్‌ను డ్రా చేసుకున్నా గొప్పే అనుకున్న స్థితి నుంచి పట్టుదలగా పుంజుకుని..అతిథ్య జట్టుపై విజయం సాధించిన తీరు చిరస్మరణీయం. ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్ లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
సోమవారం ఓవర్‌నైట్ స్కోరు 181/6తో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది భారత్(India). అయితే ఆదిలోనే పంత్(Rishabh Pant) వికెట్ తీసి భారత్ కు షాకిచ్చింది ఇంగ్లాండ్(England). కాసేపటికి ఇశాంత్ కూడా వెనుదిరిగాడు. కానీ ఊహించని విధంగా ఇంగ్లాండ్ కు షాకిచ్చారు భారత్ ఆటగాళ్లు . మహ్మద్ షమి (56 నాటౌట్; 70 బంతుల్లో 6x4, 1x6), జస్ప్రిత్ బుమ్రా (34 నాటౌట్; 64 బంతుల్లో 3x4) అద్భుత బ్యాటింగ్ చేసి... తొమ్మిదో వికెట్‌కు 89 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. వీరి అసాధారణ పోరాటంతో భారత్.. 298/8 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.
Also Read:KL Rahul test century: ఇండియా vs ఇంగ్లండ్ రెండో టెస్ట్ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ సెంచరీ
రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీసేన(Kohli) నిర్దేశించిన 272 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. టీమ్‌ఇండియా పేసర్లు వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ ఇంగ్లాండ్‌పై ఒత్తిడి పెంచారు. సిరాజ్ (Siraj)4/32, బుమ్రా(Bumra) 3/33, ఇషాంత్(Ishant) 2/13 బౌలింగ్ ధాటికి ఇంగ్లీష్ బ్యాట్స్ మెన్ పెవిలియన్ బాట పట్టారు. కెప్టెన్ జోరూట్(Joe Root)(33; 60 బంతుల్లో 5x4) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చివర్లో బట్లర్(Butler)(25; 96 బంతుల్లో 3x4), రాబిన్‌సన్(9; 35 బంతుల్లో) వికెట్ కాపాడుకునే ప్రయత్నం చేసినా బుమ్రా, సిరాజ్ వారి వికెట్లు తీసి అతిథ్య జట్టు పతనాన్ని శాసించారు. రాహుల్(Rahul)కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
భారత్ తొలి ఇన్నింగ్స్ : 364 ఆలౌట్; రాహుల్ 129, అండర్సన్ 5 వికెట్లు
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ : 391 ఆలౌట్; జో రూట్ 180 నాటౌట్, సిరాజ్ 4 వికెట్లు
భారత్ రెండో ఇన్నింగ్స్ : 298/8 డిక్లేర్; అజింక్య రహానె 61, మార్క్‌వుడ్ 3 వికెట్లు
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్: 120 ఆలౌట్; జో రూట్ 33, సిరాజ్ 4 వికెట్లు
Also Read: ప్రపంచ నేతలారా! 'మా దేశాన్ని ఈ గందరగోళం నుంచి కాపాడండి': రషీద్ ఖాన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook