Hardik Pandya: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్ తర్వాత జరిగిన ప్రతి సిరీస్‌లో రాణిస్తున్నాడు. ఐపీఎల్‌లో అడుగుపెట్టిన తొలి సీజన్‌లోనే గుజరాత్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో రఫాడించాడు. ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన టీ20, వన్డే సిరీస్‌లో అదరగొట్టాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈక్రమంలో సరికొత్త రికార్డును నెలకొల్పాడు. మాంచెస్టర్ వేదికగా జరిగిన మూడో వన్డేలో 4 వికెట్లు తీయడంతోపాటు 71 పరుగులతో పాండ్య కీలక ఇన్నింగ్స్ ఆడాడు. టెస్ట్‌ల్లో, టీ20ల్లో ఒకే మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసి..హాఫ్‌ సెంచరీ చేశాడు. తాజాగా మూడో వన్డేలోనూ అలరించాడు. దీంతో మూడు ఫార్మాట్లలో 4 వికెట్లు, 50 కంటే ఎక్కువ పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు.


ఇప్పటివరకు ఈరికార్డు పాకిస్థాన్ ఆటగాడు మహమ్మద్ హఫీజ్‌ పేరిట ఉంది. తాజాగా ఇంగ్లండ్‌ టూర్‌లో అలరించిన హార్దిక్ పాండ్య..మూడు ఫార్మాట్లో ఈరికార్డు అందుకున్న తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. మొత్తంగా వన్డేల్లో టీమిండియా తరపున నలుగురు మాత్రమే ఈరికార్డు సృష్టించారు. ఐతే విదేశాల్లో తొలి ఫీట్ అందుకున్న ప్లేయర్‌గా హార్దిక్ పాండ్య నిలిచాడు. 


Also read:Vijayendra Prasad: రాజ్యసభలో ఎంపీగా సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ ప్రమాణ స్వీకారం..!


Also read:Cooking Oil Prices: సామాన్యులకు అందుబాటులోకి వంట నూనెలు..అదానీ విల్మర్ కంపెనీ కీలక నిర్ణయం..!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook