ICC T20 Rankings: టీ20 ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్తున్న సూర్యకుమార్ యాదవ్..లెటెస్ట్ రిపోర్ట్ ఇదే..!
ICC T20 Rankings: టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌ను ఐసీసీ విడుదల చేసింది. ర్యాంకింగ్స్‌లో భారత యువ ఆటగాడు దుమ్మురేపాడు. టాప్ ర్యాంక్‌కు చేరాడు.
ICC T20 Rankings: టీ20ల్లో టీమిండియా యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ అదరగొడుతున్నాడు. నిన్న వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో 76 పరుగులతో అలరించాడు. దీంతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లాడు. 816 పాయింట్లతో రెండో స్థానానికి వెళ్లాడు. విండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఇప్పటివరకు 111 పరుగులు చేశాడు. అంతకముందు ఇంగ్లండ్ టీ20 సిరీస్‌లోనూ సూర్యకుమార్ యాదవ్ విశేషంగా రాణించాడు.
దీంతో టీ20 ర్యాంకింగ్స్‌లో ఏకంగా 44 స్థానాలు మెరుగుపర్చుకుని ఐదో స్థానానికి చేరాడు. తాజాగా విండీస్‌లో అలరిస్తున్న సూర్యకుమార్ యాదవ్ రెండో ప్లేస్‌కు చేరాడు. ఇంకో మ్యాచ్‌లో అతడు రాణిస్తే..టాప్ ప్లేస్‌కు చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే తొలి స్థానంలో ఉన్న బాబర్ ఆజమ్‌కు సూర్యకుమార్ యాదవ్‌కు రెండు పాయింట్ల తేడా ఉంది. విండీస్ టీ20 ముగిసే నాటికి అతడు ఫస్ట్ ప్లేస్ వెళ్లడం లాంఛమని విశ్లేషకులు చెబుతున్నారు.
మరోవైపు దక్షిణాఫ్రికా ఓపెనర్ రీజా హెండ్రిక్స్ 13 స్థానాలు మెరుగుపర్చుకుని 15వ స్థానంలో నిలిచాడు. వెస్టిండీస్ బ్యాటర్ బ్రాండన్ కింగ్ 27వ ర్యాంక్, ఇంగ్లండ్ ప్లేయర్ బెయిర్ స్టో 31వ స్థానంలో ఉన్నారు. మొత్తంగా 818 పాయింట్లతో బాబర్ ఆజమ్ తొలి స్థానంలో, సూర్యకుమార్ యాదవ్ 816 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నారు. టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత్ తరపున టాప్-10లో కేవలం సూర్యకుమార్ యాదవ్ మాత్రమే ఉన్నాడు.
Also read:Minister Harish Rao: ఎయిమ్స్ కంటే పీహెచ్‌సీలు మేలు..కేంద్రంపై మంత్రి హరీష్‌రావు హాట్ కామెంట్స్..!
Also read:India vs West Indies: బౌలింగ్‌లో దుమ్మురేపుతున్న హార్దిక్ పాండ్యా..తాజాగా సరికొత్త రికార్డు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook