West Indies vs India, 3rd T20I : విండీస్‌తో రెండో టీ20లో ఓటమి చవిచూసిన టీమిండియా మూడో టీ20తో మళ్లీ గెలుపు ట్రాక్ ఎక్కింది. ఏడు వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై విజయం సాధించింది. అద్భుత హాఫ్ సెంచరీతో సూర్య కుమార్ యాదవ్ టీమ్ ఇండియా గెలుపులో కీలక పాత్ర పోషించాడు. తాజా విజయంతో టీమిండియా ఈ సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఉంది.
బసెటెర్రెలోని వార్నర్ పార్క్ మైదానంలో జరిగిన మూడో టీ20లో విండీస్ మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. విండీస్ బ్యాట్స్‌మెన్‌లో ఓపెనర్ మేయర్స్ 4 సిక్సులు,8 ఫోర్లతో 73 (50) పరుగులు చేసి జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ పెద్దగా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. భారత బౌలర్లలో భువనేశ్వర్ 2 వికెట్లు తీయగా, పాండ్యా, అర్షదీప్ సింగ్ చెరో వికెట్ తీశారు.
విండీస్ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా మరో ఓవర్ మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. టీమిండియా బ్యాట్స్‌మెన్‌లో సూర్యకుమార్ యాదవ్ కేవలం 44 బంతుల్లోనే 76 పరుగులు చేసి జట్టు గెలుపులో కీలకంగా వ్యవహరించాడు. రిషబ్ పంత్ (33) పరుగులతో రాణించాడు. మొత్తంగా 19 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి టీమిండియా 165 పరుగులు చేసింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సూర్య కుమార్ యాదవ్‌కే దక్కింది.
ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగడం గమనార్హం. నడుము భాగంలో కండరాల నొప్పితో రోహిత్ మైదానాన్ని వీడాడు. దీంతో రోహిత్ శర్మ నాలుగో టీ20కి అందుబాటులో ఉంటాడా ఉండడా అనే సందేహాలు నెలకొన్నాయి. అయితే తాజా మ్యాచ్ అనంతరం రోహిత్ మాట్లాడుతూ.. ప్రస్తుతానికి తాను బాగానే ఉన్నానని, తదుపరి మ్యాచ్ వరకు అంతా సెట్ అవుతుందని భావిస్తున్నానని చెప్పుకొచ్చాడు. వెస్టిండీస్-ఇండియా జట్ల మధ్య నాలుగో టీ20 ఆగస్టు 6న జరగనుంది.
Also Read: Horoscope Today August 3rd: నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి ఇవాళ ఊహించని స్థాయిలో ధనలాభం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook