IND vs AUS: అనారోగ్య సమస్య ఉన్నా..హైదరాబాద్ మ్యాచ్‌లో సూర్యకుమార్ సూపర్ ఇన్నింగ్స్..!
IND vs AUS: టీమిండియా ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ సూపర్ షో కొనసాగుతోంది. గతకొంతకాలంగా టీ20ల్లో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడుతున్నారు. హైదరాబాద్ మ్యాచ్ ముందు అతడి పరిస్థితి గురించి ఓ విషయం చూసింది.
IND vs AUS: హైదరాబాద్ ఉప్పల్ మ్యాచ్‌లో టీమిండియా యంగ్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ఆకట్టుకున్నాడు. సుడి గాలి ఇన్నింగ్స్‌తో భారత జట్టును విజయం దిశగా నడిపాడు. మూడో టీ20 మ్యాచ్‌లో ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ త్వరగా ఔట్ అయ్యారు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన మిస్టర్ 360..కోహ్లీతో కలిసి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 36 బంతుల్లో 69 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సిక్సర్లు, ఐదు ఫోర్లు ఉన్నాయి.
మిడిల్ ఓవర్లలో టీమిండియాకు బలమైన పునాది వేశాడు. మొత్తంగా మరో బంతి ఉండగానే భారత్ విజయం సాధించింది. సూపర్ బ్యాటింగ్ చేసిన అతడే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఈమ్యాచ్ అనంతరం సూర్యకుమార్ గురించి ఆరోగ్య పరిస్థితి వెలుగు చూశాయి. హైదరాబాద్ మ్యాచ్‌కు ముందు సూర్యకుమార్ యాదవ్ అనారోగ్య పాలైయ్యాడు. మ్యాచ్‌కు ముందు కడుపునొప్పి, జ్వరంతో బాధపడ్డానని అతడే స్వయంగా వెల్లడించాడు.
మ్యాచ్ గెలిచిన అనంతరం అక్షర్ పటేల్ అడిగిన ప్రశ్నలకు సూర్య బదులు ఇచ్చాడు. ఈమ్యాచ్ ఎంత ముఖ్యమో తనకు తెలుసు అని..అనారోగ్య కారణాలతో బెంచ్ పై కూర్చోవడానికి సిద్ధంగా లేనని తెలిపాడు. ఇదే విషయాన్ని డాక్టర్, ఫిజియోతో చెప్పానని..ఏం చేసైనా మ్యాచ్‌కు సిద్ధం చేయమని చెప్పానని వివరించాడు. గ్రౌండ్‌లో అడుగు పెట్టాక తనను చుట్టుముట్టిన భావోద్వేగాల గురించి వర్ణించలేనన్నాడు సూర్యకుమార్ యాదవ్.
Also read:Jagga Reddy: జగన్, షర్మిల బీజేపీ వదిలిన బాణాలే..ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు..!
Also read:CM Jagan: అంగన్‌వాడీల నుంచే నాణ్యమైన విద్య..అధికారులకు సీఎం జగన్ ఆదేశం..!
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook