ICC announces Test Team of Year 2023: ఐసీసీ పురుషుల 'టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయ‌ర్ 2023'(Test Team Of The Year)’ జట్టును అనౌన్స్ చేసింది. గతేడాది ఐదు రోజుల క్రికెట్ ఆటలో అద్భుత ప్రదర్శన చేసిన 11 మందిని ఎంపిక చేసింది. ప్ర‌పంచ టెస్టు చాంపియ‌న్‌షిప్(WTC) 2023 ఫైన‌ల్లో ఆడిన భార‌త్, ఆస్ట్రేలియా జ‌ట్ల నుంచి ఏడుగురుని అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సెలెక్ట్ చేసింది. ఏకంగా ఆసీస్ నుంచి ఐదుగురు ప్లేయర్స్ టీమ్ లో చోటు దక్కించుకోవడం విశేషం. ఈ జట్టుకు కెప్టెన్ గా ఆసీస్ సారథి ప్యాట్ క‌మిన్స్ ను ఎంపిక చేశారు. టీమిండియా నుంచి ఆల్‌రౌండ‌ర్లు ర‌విచంద్ర‌న్ అశ్విన్, ర‌వీంద్ర జ‌డేజాలు స్థానం సంపాదించారు. ఇంగ్లండ్ నుంచి ఇద్ద‌రు, న్యూజిలాండ్, శ్రీ‌లంక జ‌ట్టు నుంచి ఒక్కరికి టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయ‌ర్ 2023లో ప్లేస్ దక్కింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయ‌ర్: ప్యాట్ క‌మిన్స్(కెప్టెన్), ఉస్మాన్ ఖ‌వాజా, ట్రావిస్ హెడ్, అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్, ర‌విచంద్ర‌న్ అశ్విన్, ర‌వీంద్ర జ‌డేజా, దిముత్ క‌రుణ‌ర‌త్నే, కేన్ విలియ‌మ్స‌న్, జో రూట్. 



ఇవాళే ప్రకటించిన 'ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ 2023'కి కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఎంపికయ్యాడు. ఐసీసీ ప్రకటించిన 11 మంది క్రికెట‌ర్లలో ఆరుగురు భారత ఆటగాళ్లు, ఇద్దరు ఆస్ట్రేలియన్లు, ఇద్దరు దక్షిణాఫ్రికా ఆటగాళ్ళు మరియు ఒక న్యూజిలాండ్ ప్లేయర్ ఉన్నాడు. రోహిత్ తోపాటు గిల్, కోహ్లీ, సిరాజ్, మహ్మద్ షమీ మరియు కుల్దీప్ యాదవ్ లకు తుది జట్టులో చోటు దక్కింది. 


వ‌న్డే జ‌ట్టు ఆఫ్ ది ఇయ‌ర్ : రోహిత్ శ‌ర్మ‌(కెప్టెన్), శుభ్‌మ‌న్ గిల్, ట్రావిస్ హెడ్, విరాట్ కోహ్లీ, డారిల్ మిచెల్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీప‌ర్), మార్కో జాన్‌సేన్, ఆడం జంపా, మ‌హ్మ‌ద్ సిరాజ్, కుల్దీప్ యాద‌వ్, మ‌హ్మ‌ద్ ష‌హీ.


Also Read: ICC: 2023 వన్డే అత్యుత్తమ జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. టాప్-11లో ఆరుగురు మనోళ్లే..


Also Read: Kohli Duplicate Video: అయోధ్య‌లో డూప్లికేట్ కోహ్లీ సందడి.. సెల్ఫీల కోసం ఎగ‌బ‌డ్డ జ‌నం.. వీడియో వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter