India vs England 2024 Test Series: ఇంగ్లండ్ బజ్‌బాల్ కు ఇండియాలో బొక్క పడింది. గత కొన్నేళ్లుగా బజ్‌బాల్ అంటూ దూకుడైన ఆటతీరుతో ప్రత్యర్థులను చిత్తుచేస్తున్న స్టోక్సే సేనకు ఇండియాలో చుక్కెదురైంది. మరో టెస్టు మిగిలి ఉండగానే రోహిత్ సేన 3-1తో సిరీస్ గెలిచింది. స్వదేశంలో 12 ఏళ్లుగా ఒక్క సిరీస్ కూడా ఓడిపోని భారత్ జట్టు వరుసగా 17వ సిరీస్ ను కైవసం చేసుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ పుష్కర కాలంలో ఇండియన్ టీమ్ కనీసం సిరీస్ ను డ్రా కూడా చేసుకోలేదంటే ఏ స్థాయిలో ఆధిపత్యాన్ని ప్రదర్శించిందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. స్టోక్స్ కెప్టెన్సీలో ఒక్క ఓటమి కూడా ఎరగని ఇంగ్లీష్ జట్టుకు ఇండియాలో బ్రేక్ పడింది. ఓటమి ఎలా ఉంటుందో రుచి చూపించింది భారత్. 2012లో చివరిసారి ఇదే ఇంగ్లండ్ చేతిలో టెస్ట్ సిరీస్ ఓడిపోయింది టీమిండియా. అప్పటి నుంచి ఆలాంటి పరాభవం మూటగట్టుకోలేదు భారత్ జట్టు. 


Also Read: WTC 2023-25 Points Table: డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో దుమ్మురేపిన టీమిండియా.. రోహిత్ సేన స్థానం ఎంతంటే?


20224లో స్టోక్స్, మెకల్లమ్ కాంబినేషన్ లో టెస్టు క్రికెడ్ ఆడే విధానాన్ని మార్చేసింది ఇంగ్లండ్ టీమ్. దూకుడైన ఆటతీరుతో వరుస విజయాలతో దూసుకెళ్లింది. గత రెండేళ్లులో ఏడు టెస్టు సిరీస్ లు ఆడిన స్టోక్స్ సేన నాలుగు గెలిచి.. మూడు డ్రా చేసుకుంది. ఇప్పుడు ఇండియాలో తాము ఆడిన ఎనిమిదో సిరీస్ లో భంగపాటుకు గురైంది. ఇంగ్లండ్ పప్పులు ఏవీ ఇండియాలో ఉడకలేదు. హైదరాబాద్ టెస్టులో అనూహ్యంగా గెలిచిన ఇంగ్లండ్. వైజాగ్, రాజ్ కోట్, రాంచీ టెస్టులో గెలిచి ఇంగ్లండ్ కు భారత్ సత్తా ఏంటో చూపించింది. 


Also Read: Hanuma Vihari: హనుమా విహారి సంచలన పోస్ట్.. ఆ ప్లేయర్‌ను తిట్టినందుకే కెప్టెన్సీ పోయింది..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి