Team India: సఫారీ దెబ్బకు టాప్ ఫ్లేస్ కోల్పోయిన భారత్.. ఏకంగా ఎన్ని స్థానాలు దిగజారిందంటే?
Team India: సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే. సఫారీ జట్టు కొట్టిన దెబ్బకు భారత జట్టు టాప్ ప్లేస్ గల్లంతైంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీ ర్యాంకింగ్స్ లో టీమిండియా ఎన్నో స్థానంలో ఉందంటే?
WTC 2023-25 Points Table: సఫారీలు ఇచ్చిన షాక్ నుంచి తేరుకోకముందే టీమిండియాకు మరో షాక్ తగిలింది. తాజాగా భారత జట్టు వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ 2023-25 పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని కోల్పోయింది . సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారీ తేడాతో ఓడిపోవడమే దీనికి కారణం. ఈ మ్యాచ్ కు ముందు భారత జట్టు 66.67 పాయింట్లతో తొలి స్థానంలో ఉండేది. తాజా ఓటమితో ఏకంగా ఐదో స్థానానికి(44.44 పాయింట్లు) పడిపోయింది.
టీమిండియాను ఇన్నింగ్స్ తో తేడాతో ఓడించిన ప్రోటీస్ జట్టు 100 పాయింట్లతో టాప్ కు చేరుకుంది. దక్షిణాఫ్రికా తర్వాత స్థానాల్లో పాకిస్థాన్, న్యూజిలాండ్ మరియు బంగ్లాదేశ్ ఉన్నాయి. ఆస్ట్రేలియా ఆరో స్థానంలో, చివరి మూడు స్థానాల్లో వెస్టిండీస్, ఇంగ్లాండ్, శ్రీలంక ఉన్నాయి. అయితే పాకిస్తాన్ తో జరుగుతున్న సెకండ్ టెస్టు మ్యాచ్ లో ఆసీసీ కనుక గెలిస్తే డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో సఫారీ జట్టును వెనుక్కి నెట్టి టాప్ ప్లేస్ కు చేరుకునే అవకాశం ఉంది. ఒక వేళ భారత జట్టు సఫారీ జట్టుపై రెండో టెస్టు గెలిస్తే టీమిండియా ర్యాంకు మెరుగుపడే అవకాశం ఉంది.
విరాట్ అరుదైన ఘనత
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో కోహ్లీ తొలి ఇన్నింగ్స్‌లో 38, రెండో ఇన్నింగ్స్‌లో 76 పరుగులు చేయడం ద్వారా ఓ అరుదైన ఘనతను సొంత చేసుకున్నాడు. 146 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఏడు క్యాలెండర్ సంవత్సరాల్లో 2000+ పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా కోహ్లి రికార్డు సృష్టించాడు. విరాట్ 2012లో 2,186 పరుగులు, 2014లో 2,286 పరుగులు, 2016లో 2,595 పరుగులు, 2017లో 2,818 పరుగులు, 2017లో 2,735 పరుగులు, 2019లో 2,455 పరుగులు చేశాడు. ఈ ఏడాది 2,006 రన్స్ చేశాడు.
Also Read: India Vs South Africa: చేతులేత్తిసిన బ్యాట్స్‌మెన్.. తొలి టెస్టులో టీమిండియా చిత్తు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter