IND Vs SA 1st Test Full Highlights: సెంచూరియన్ వేదిక జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో భారత్‌పై సఫారీ గెలుపొందింది. ఈ ఓటమితో దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్ గెలవాలన్న భారత్ కల చెదిరిపోయింది. 163 పరుగుల తొలి ఇన్నింగ్స్ లోటుతో బరిలోకి దిగిన భారత్.. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 131 పరుగులకే కుప్పకూలింది. విరాట్ కోహ్లీ (76) మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్ అంతా దారుణంగా విఫలమయ్యారు. అంతకుముందు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 408 పరుగులు చేసింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 245 పరుగులకే పరిమితమైన విషయం తెలిసిందే.
రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్ చెలరేగి ఆడుతారని అభిమానులు ఆశలు పెట్టుకోగా.. దారుణంగా నిరాశపరిచారు. కెప్టెన్ రోహిత్ శర్మ పరుగులేమీ చేయకుండానే డకౌట్ అయ్యాడు. యశస్వి జైస్వాల్ 5 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. కాసేపు క్రీజ్‌లో కుదురుకున్నట్లే కనిపించిన శుభ్‌మన్ గిల్ (26) కూడా ఔట్ అవ్వడంతో భారత్ కష్టాల్లో పడింది. విరాట్ కోహ్లి (76) ఓ ఎండ్ నుంచి పోరాడుతున్నా.. అవతలి ఎండ్ నుంచి సహకారం లభించలేదు. శ్రేయాస్ అయ్యర్ (6), కేఎల్ రాహుల్ (4), రవి అశ్విన్ (0), శార్దూల్ ఠాకూర్ (2), జస్ప్రీత్ బుమ్రా (0), మహ్మద్ సిరాజ్ (4) తక్కువ స్కోరుకే ఔట్ అవ్వగా.. కోహ్లీ చివరి వికెట్ రూపంలో పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో 131 పరుగలకే భారత్ ఆలౌట్ అయి.. ఇన్నింగ్స్ 32 రన్స్ తేడాతో దారుణ ఓటమిని మూటగట్టుకుంది.
దక్షిణాఫ్రికా బౌలర్లలో నాండ్రే బెర్గర్ అత్యధికంగా 4 వికెట్లు తీయగా.. మార్కో యూన్సెన్ 3, కగిసో రబాడ 2 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌లో కగిసో రబడ మొత్తం 7 వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ (101) సెంచరీ సాధించకపోయి ఉంటే.. టీమిండియ పరిస్థితి మరింత ఘోరంగా ఉండేది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 4, మహ్మద్ సిరాజ్ 2, ప్రసిద్ధ్ కృష్ణ, రవి అశ్విన్‌లు చెరో వికెట్ తీశారు.
దక్షిణాఫ్రికా ఓపెనర్ డీన్ ఎల్గర్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. డీన్ ఎల్గర్ 185 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ విజయంతో 2 టెస్టుల సిరీస్‌లో దక్షిణాఫ్రికా జట్టు 1-0తో ఆధిక్యంలో నిలిచింది. భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య కేప్‌టౌన్ వేదికగా జనవరి 3 నుంచి సిరీస్‌లో రెండో టెస్టు ప్రారంభంకానుంది. రెండో టెస్టులో అయినా.. విజయం సాధించి సిరీస్‌ను డ్రాగా ముగించాలని టీమిండియా భావిస్తోంది.
Also Read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter