Khaleel Ahmed: టీమిండియా అభిమానులకు బ్యాడ్‌న్యూస్.. హాస్పిటల్ బెడ్‌పై స్టార్ ఆటగాడు
Khaleel Ahmed: భారత అభిమానులకు ఓ చేదు వార్త. టీమి ఇండియా ఆటగాడు అనారోగ్య సమస్యలతో చాలా కాలంగా క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈ యంగ్ ప్లేయర్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.
Khaleel Ahmed: టీమిండియా ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో ఉంది. త్వరలోనే రంజీ ట్రోఫీ 2022-23 భారత దేశవాళీ క్రికెట్ పోటీలు ప్రారంభం కానున్నాయి. వీటన్నింటి మధ్య టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఖలీల్ అహ్మద్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పాడు. అనారోగ్య కారణాలతో చాలా కాలంగా క్రికెట్‌కు దూరంగా ఉన్న లెఫ్టార్మ్ స్పీడ్ స్టార్.. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. రంజీ ట్రోఫీలో ప్రారంభంలో కొన్ని మ్యాచ్‌లలో కూడా దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఖలీల్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. హాస్పిటల్ బెడ్‌పై ఉన్న ఫొటోను పంచుకున్నాడు.
'ప్రియమైన వారందరికీ.. క్రికెట్‌కు దూరంగా ఉండటం నాకు చాలా కష్టమైన సమయం. అనారోగ్య కారణాల వల్ల ఈ రంజీ సీజన్‌లో జరిగే చాలా మ్యాచ్‌లలో నేను ఆడలేకపోవడం చాలా దురదృష్టకరం. నేను తిరిగి వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఫిట్‌నెస్‌ను పొందిన వెంటనే తిరిగి రావడానికి ప్రయత్నిస్తాను. అందరి శుభాకాంక్షలకు నేను కృతజ్ఞుడను' అని ఖలీల్ అహ్మద్ రాసుకొచ్చాడు.
ఆసియా కప్ 2018లో హాంకాంగ్‌తో అరంగేట్రం చేశాడు ఈ స్పీడ్ స్టార్. టోర్నీ గెలిచిన తర్వాత.. కెప్టెన్ రోహిత్ శర్మ ఖలీల్ అహ్మద్‌కు ట్రోఫీని ఎత్తే అవకాశాన్ని ఇచ్చాడు. ఆ తరువాత కూడా ఎన్నో అవకాశాలు వచ్చిన ఈ యంగ్ ప్లేయర్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు.
ఖలీల్ అహ్మద్ టీమిండియా తరఫున మొత్తం 25 మ్యాచ్‌లు ఆడాడు. అతను 14 టీ20 మ్యాచ్‌లలో భారత్ తరపున 13 వికెట్లు పడగొట్టాడు. 8.83 ఎకానమీతో పరుగులు ఇచ్చాడు. అదే సమయంలో 5.81 ఎకానమీతో 11 వన్డేల్లో 15 వికెట్లు పడగొట్టాడు. నవంబర్ 2019 నుంచి టీమిండియా తరపున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఐపీఎల్ 2022లో ఢిల్లీ తరఫున మంచి ప్రదర్శన చేశాడు. ఈ సీజన్‌లో 10 మ్యాచ్‌లు ఆడి 16 వికెట్లు తీశాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న ఖలీల్ అహ్మద్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.
Also Read: Ap Secretariat System: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు శుభవార్త
Also Read: Jio Phone 5G: సూపర్ ఫీచర్స్‌తో అతి తక్కువ ధరకే జియో 5G ఫోన్.. త్వరలోనే లాంచ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి