India squad for remaining three Tests vs England: ఇంగ్లాండ్‌తో మిగిలిన మూడు టెస్టు మ్యాచ్‌లకు జట్టును ప్రకటించింది బీసీసీఐ. ముందుగా అనుకున్నట్లే విరాట్ కోహ్లీ సిరీస్ మెుత్తానికి దూరమవ్వగా.. గాయాలతో రెండు టెస్టుకు దూరమైన రాహుల్, జడేజా తిరిగి జట్టులోకి వచ్చారు. వరుసగా విఫలమవుతూ వస్తున్న శ్రేయస్ అయ్యర్ ను గాయం కారణంగా తప్పించారు. అతడి స్థానంలో సర్ఫరాజ్‌ ఖాన్‌ కు చోటు దక్కింది. రజత్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. కొత్తగా  ఆకాశ్‌ దీప్‌ ను జట్టులోకి తీసుకున్నారు. రెండో టెస్టు స్క్వాడ్‌లో ఉన్న అవేశ్‌ ఖాన్‌, సౌరభ్‌ కుమార్‌ను సెలక్టర్లు పక్కన పెట్టేశారు. సిరాజ్ జట్టులోకి తిరిగి వచ్చాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియా, ఇంగ్లండ్ లు చెరో మ్యాచ్ నెగ్గాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాజ్ కోట్ వేదికగా మూడో టెస్టు ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 23 నుంచి నాలుగో టెస్టు రాంచీ వేదికగా, ఐదో టెస్టు మార్చి 07న ధర్మశాల వేదికగా జరగనున్నాయి. వ్యక్తిగత కారణాల వల్ల సిరీస్ మెుత్తానికి దూరమైన కోహ్లీ నిర్ణయాన్ని తాము గౌరవిస్తామని బీసీసీఐ తెలిపింది. మూడో టెస్టు నాటికి రాహుల్, జడేజా ఫిట్‌నెస్‌ క్లియరెన్స్‌ వస్తేనే తుది జట్టులోకి తీసుకుంటామని.. ఈ మేరకు బీసీసీఐ వైద్య బృందం నుంచి రిపోర్టులు రావాల్సి ఉందని స్పష్టం చేసింది. 


Also read: SL VS AFG: లంక క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు.. డబుల్ సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా నిస్సాంక.


మిగతా మూడు టెస్టులకు జట్టు ఇదే: 
రోహిత్ శర్మ (కెప్టెన్), జస్‌ప్రీత్ బుమ్రా (వైస్‌ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్‌ గిల్, కేఎల్ రాహుల్, రజత్‌ పటీదార్, సర్ఫరాజ్‌ ఖాన్, ధ్రువ్‌ జురెల్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్‌దీప్‌ యాదవ్, సిరాజ్, ముకేశ్‌ కుమార్, ఆకాశ్‌ దీప్‌.



Also Read: U-19 World Cup Final: సెమీ‌స్‌లో పాక్‌పై విజయం.. ఫైన‌ల్స్‌లో టీమిండియా ప్రత్యర్థిగా ఆస్ట్రేలియా..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి