Shubman Gill stunning catch to dismiss Ross Taylor: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో నేడు (5వ రోజు) వర్షం సమస్య లేకపోవడంతో మ్యాచ్ సజావుగా సాగుతోంది. ఓవర్‌నైట్ స్కోరు 101/2తో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ త్వరగానే కీలక వికెట్ చేజార్చుకుంది. ఈరోజు టీమిండియా బౌలర్ షమీ వికెట్ల ఖాతా తెరిచాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీమిండియా యువ సంచలనం శుభ్‌మన్ గిల్ పట్టిన అద్భుత క్యాచ్‌కు కివీస్ కీలక ఆటగాడు రాస్ టేలర్ పెవిలియన్ బాట పట్టాడు. ఇన్నింగ్స్ 63వ ఓవర్ తొలి బంతికి షమీ వేసిన బంతికి సరిగా అంచనా వేయలేకపోయిన టేలర్ చివరి నిమిషంలో షాట్ ఆడాడు. షార్ట్ కవర్స్ దిశగా టేలర్ (11) ఆడిన బంతిని పక్షిలా గాల్లోకి ఎగిరి Team India ఆటగాడు శుభ్‌మన్ గిల్ క్యాచ్ అందుకోవడంతో టేలర్ 4వ వికెట్ రూపంలో నిష్క్రమించాడు. గిల్ పట్టిన అద్భుతమైన క్యాచ్‌కు క్రికెట్ ప్రేమికులు, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. టేలర్ ఇచ్చిన క్యాచ్‌ను గిల్ పట్టిన తీరు అమోఘం అంటూ కామెంట్లు చేస్తున్నారు.


Also Read: WTC Final: ఎంఎస్ ధోనీని వెనక్కి నెట్టిన Virat Kohli, ఆసియాలో నెంబర్ వన్‌గా Team India కెప్టెన్



మరోవైపు WTC Finalలో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 217 పరుగులకు ఆలౌటైంది. ఆట అయిదో రోజు టీమిండియా బౌలర్లు కివీస్ బ్యాట్స్‌మన్‌ను ఇబ్బంది పెడుతున్నారు. స్వింగ్ రాబడుతూ డాట్ బాల్స్‌తో కివీస్ బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి తేవడంతో సక్సెస్ అయ్యారు. ఆపై హెన్రీ నికోల్స్ (7) కథను ఇషాంత్ శర్మ ముగించాడు. ఈరోజు తొలి వికెట్ తీసిన ఉత్సాహంలో మహమ్మద్ షమీ మరో రెండు వికెట్లు పడగొట్టి కివీస్‌ను కష్టాల్లోకి నెట్టాడు. బీజే వాట్లింగ్‌ను షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం ఆల్ రౌండర్ కోలిన్ డీ గ్రాండ్‌హోమ్ (13)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో కివీస్ 6వ వికెట్‌‌ను 162 పరుగుల వద్ద కోల్పోయింది. 


Also Read: MS Dhoni New look: ఎంఎస్ ధోనీ న్యూ లుక్ ఫొటో ట్రెండింగ్, Singham అంటూ ఫ్యాన్స్ కామెంట్స్


టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రాకు వికెట్లేమీ దొరకలేదు. రవీంద్ర జడేజా 7 ఓవర్లు వేసి 14 పరుగులు ఇవ్వగా, మరో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్  కివీస్ ఓపెనర్ టామ్ లాథమ్ వికెట్ తీశాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, కైల్ జేమీసన్ క్రీజులో ఉన్నారు. కాగా, మ్యాచ్ 5 రోజులలో చాలా ఓవర్లు వేయడం సాధ్యంకాని పక్షంలో రిజర్వ్ డే ఉంటుందని ఐసీసీ ఇదివరకే ప్రకటించింది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook