Team India squad for WTC final: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆటగాళ్లను ఎంపిక చేసింది. కొన్ని రోజుల కిందట ప్రాబబుల్స్ ఆటగాళ్ల జాబితాను విడుదల చేసిన బీసీసీఐ మంగళవారం నాడు 15 మందితో కూడిన ఆటగాళ్ల జాబితా ప్రకటించింది.
జూన్ 18 నుంచి సౌతాంప్టన్ లోని ఏజిస్ బౌల్ వేదికగా అంతర్జాతీయ క్రికెట్ మండలి తొలిసారిగా నిర్వహిస్తోన్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ (WTC Final 2021) మ్యాచ్ ప్రారంభం కానుంది. గత రెండేళ్లుగా టెస్టుల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన తొలి రెండు జట్లు న్యూజిలాండ్, టీమిండియా ఫైనల్ చేరుకోవడం తెలిసిందే. ఈ మేరకు విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా మొత్తం 15 మంది టీమిండియా ఆటగాళ్ల జాబితా విడుదల చేసింది. కీపర్లలో అయితే సాహా కన్నా పంత్‌కే తుది జట్టులో ఛాన్స్ దొరికే అవకాశం అధికంగా ఉంది. ఒకే స్పిన్నర్ అవసరం అనుకుంటే జడేజా, అశ్విన్‌లలో ఒకరు తుది జట్టులోకి వస్తారు.
Also Read: WTC Final: టీమిండియా బౌలర్ Ravichandran Ashwinపై పాకిస్తాన్ బౌలర్ సంచలన ఆరోపణలు
Team India announced their 15-member squad- V Kohli (C), A Rahane (VC), R Sharma, S Gill, C Pujara, H Vihari, R Pant, W Saha, R Ashwin, R Jadeja, J Bumrah, Ishant Sharma, Mohammad Shami, U Yadav & Md. Siraj for the World Test Championship 21 Final: BCCI pic.twitter.com/5BjHidcfHY
— ANI (@ANI) June 15, 2021
బీసీసీఐ ప్రకటించిన 15 మంది ఆటగాళ్లు వీరే:
విరాట్ కోహ్లీ (Virat Kohli) (కెప్టెన్), అజింక్య రహానే (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, చతేశ్వేర్ పుజారా, హనుమ విహారి, రిషబ్ పంత్, సాహా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, జస్ప్రిత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, మహమ్మద్ సిరాజ్
Also Read: WTC Prize Money: ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్ విజేత ప్రైజ్‌మనీపై ICC ప్రకటన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook