KTR: ఐపీఎల్ 2021 విషయంలో BCCIకి విజ్ఞప్తి చేసిన Telangana మంత్రి కేటీఆర్
KTR On IPL 2021 In Hyderabad: తొలుత ఐపీఎల్‌ను కేవలం మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లోనే నిర్వహించనున్నారని కేవలం 6 స్టేడియాల్లో ఈ ప్రక్రియ జరుగుతుందని ప్రచారం జరిగింది. ఐపీఎల్‌ను 6 రాష్ట్రాల్లో నిర్వహించేందుకు బీసీసీఐ యోచిస్తోందని సమాచారం.
KTR On IPL 2021 In Hyderabad: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2021) మినీ వేలం ఇటీవల నిర్వహించారు. అది ముగిసిన తరువాత ఐపీఎల్ షెడ్యూల్, ఐపీఎల్ వేదికలపై ఫ్రాంచైజీలతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఫోకస్ చేస్తున్నాయి. ఈ క్రమంలో తొలుత ఐపీఎల్‌ను కేవలం మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లోనే నిర్వహించనున్నారని కేవలం 6 స్టేడియాల్లో ఈ ప్రక్రియ జరుగుతుందని ప్రచారం జరిగింది.
ఐపీఎల్‌ను 6 రాష్ట్రాల్లో నిర్వహించనున్నారని, ఐపీఎల్ 2021(IPL 2021) కోసం ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలను బీసీసీఐ, ఐపీఎల్ పాలక మండలి పరిశీలిస్తున్నట్లు కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. అతి తక్కువ కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న మెట్రో నగరమైన హైదరాబాద్‌లోనూ ఐపీఎల్ తాజా సీజన్ నిర్వహించాలని బీసీసీఐ, ఐపీఎల్ పాలక మండలిని కోరుతూ ట్వీట్ చేశారు.
Also Read: IND vs ENG 4th Test: యువరాజ్‌కు మద్దతుగా నిలిచిన రవిచంద్రన్ అశ్విన్, ఆ ట్వీట్లపై క్లారిటీ
‘హైదరాబాద్‌ను సైతం ఐపీఎల్ వేదికల జాబితాలో చేర్చండి. కరోనా కేసులు తక్కువగా నమోదైన మెట్రో నగరం హైదరాబాద్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐపీఎల్ నిర్వహణకు సంబంధించి తగిన సహకారాన్ని తప్పక అందజేస్తామని’ మంత్రి కేటీఆర్(TS Minister KTR) తన ట్వీట్‌లో పేర్కొన్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ పేరుతో లోకల్ ఫ్రాంచైజీ సైతం ఉన్న హైదరాబాద్ కచ్చితంగా ఐపీఎల్ వేదికను కోరుకోవడంతో ఏ మాత్రం ఆశ్చర్యం అక్కర్లేదు. మంత్రి కేటీఆర్ ట్వీట్‌పై బీసీసీఐగానీ లేక ఐపీఎల్ పాలక మండలి స్పందించాల్సి ఉంది.
Also Read: Kira narayanan: ఇండియా-ఇంగ్లండ్ సిరీస్ యాంకర్ కిరా నారాయణన్ స్టైల్ చూస్తారా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook