Ravichandran Ashwin Supports Yuvraj Singh Over Tweet Row | టీమిండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మూడో టెస్టు పలు వివాదాలకు కారణమైంది. తొలి టెస్టులో ఇంగ్లాండ్ నెగ్గగా, రెండో టెస్టులో విరాట్ కోహ్లీ సేన ప్రతీకారం తీర్చుకుంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అతిపెద్దదైన నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మూడో టెస్టులో భారత్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
కేవలం 2 రోజుల్లోనే టెస్టు మ్యాచ్ ముగియడంతో టెస్ట్‌కు మోతెరాలో ఏర్పాటుచేసిన పిచ్ మీద ఇంగ్లాండ్ క్రికెటర్లు, ఆ దేశ మాజీ ఆటగాళ్లు సైతం విమర్శలు చేశారు. ఇది టెస్టు క్రికెట్‌కు మంచిదికాదని, పిచ్ తయారు చేయడాన్ని తప్పుపట్టారు. అయితే టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ సైతం మూడో టెస్టుపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. అశ్విన్(Ravichandran Ashwin) 400 వికెట్ల ఘనత చేరుకున్న విషయం తెలిసిందే. అయితే ఇలాంటి పిచ్‌ల మీద ఒకవేళ హర్భజన్ సింగ్, అనిల్ కుంబ్లేలు బౌలింగ్ చేసి ఉంటే 800, 1000 వికెట్లు సైతం అవలీలగా తీసేవారని యువరాజ్ చేసిన ట్వీట్లు వివాదాస్పదంగా మారాయి.
Also Read: Ind vs Eng 3rd Test Highlights: నరేంద్ర మోదీ స్టేడియంలో రికార్డుల మోత మోగించిన Virat Kohli సేన
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టెస్టు ముగిసిన తరువాత అశ్విన్ సైతం కొన్ని ట్వీట్లు చేయడంలో యువరాజ్‌కు కౌంటర్ ఇచ్చాడని నెటిజన్లు భావించారు. దీనిపై టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. యువరాజ్ సింగ్(Yuvraj Singh) చేసిన ట్వీట్లపై తాను స్పందించలేదన్నాడు. యువీ ట్వీట్లలో తనకు తప్పేమీ కనిపించలేదని చెప్పాడు. అయితే తనకు ఏదో విషయాన్ని చెబుతున్నట్లుగా తాను భావించడం లేదని యువరాజ్‌కు మద్దతుగా నిలిచాడు.
Also Read: R Ashwin: టీమిండియా స్టార్ స్పిన్నర్ అశ్విన్ ఖాతాలో అరుదైన రికార్డు
మరోవైపు మూడో టెస్టులో మొత్తంగా 30 వికెట్లు పడగా, అందులో 28 వికెట్లు స్పిన్నర్లు మాత్రమే పడగొట్టారు. ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ సైతం బంతిని అందుకుని ఏకంగా రికార్డ్ స్పెల్ వేసి 5 వికెట్లు తీయడం తెలిసిందే. ప్రస్తుతానికి ఇంగ్లాండ్‌పై 2-1తో విరాట్ కోహ్లీ సేన ఆధిక్యంలో ఉండగా, చివరి టెస్టులోనూ నెగ్గి సిరీస్ కైవసం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. తొలిసారిగా జరగనున్న ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్ ఫైనల్ చేరుకుని న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోవాలని భారత ఆటగాళ్లు ఉవ్విళ్లూరుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook