గతేడాది జరిగిన వన్డే ప్రపంచ కప్‌లో విజేతగా నిలిచిన ఇంగ్లాండ్ తొలిసారి ఈ ట్రోఫీని ముద్దాడింది. ఇంగ్లాండ్‌ను విశ్వవిజేతగా నిలిపిన ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ భారత జట్టుపై, ముఖ్యంగా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. తమతో జరిగిన మ్యాచ్‌లో ఆడిన ధోనీలో అసలు ఎలాంటి కసి కనిపించలేదని సంచలన వ్యాఖ్యలు చేశాడు.  భారీ సంఖ్యలో గబ్బిలాల మృత్యువాత.. కరోనా భయం!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది. భారత్ గెలవాలంటే 11 ఓవర్లలో 112 పరుగులు చేయాల్సిన తరుణంలో క్రీజులోకి వచ్చిన ధోనీ బ్యాటింగ్ తనకు వింతగా అనిపించిందని స్టోక్స్ పేర్కొన్నాడు. ‘వాస్తవానికి మరో 12 బంతులు (2 ఓవర్లు) ముందుగానే భారత్ 338 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తున్నానని భావించాను. కానీ సిక్సర్ల మీద ఫోకస్ చేయాల్సిన ధోనీ సింగిల్స్ తీయడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. నింపాదిగా అతడు సింగిల్స్ తీసుకుంటూ మ్యాచ్‌ను భారత్ నుంచి దూరం చేశాడనిపిస్తోంది.  వరల్డ్ క్రేజీ మోడల్ బికినీ ఫొటోలు వైరల్


కేదార్ జాదవ్ సైతం చాలా నెమ్మదిగా బ్యాటింగ్ చేశాడు. ధోనీని చూస్తే రన్ రేట్ కాపాడుకునేందుకు సింగిల్స్ తీస్తూ వికెట్లు పడకుండా అడ్డుకున్నాడని మా టీమ్ భావించింది. గెలుపు కోసం యత్నించకుండా కేవలం సింగిల్స్‌కే పరిమితం కావడంతో ధోనీలో గెలవాలన్న కసి కనిపించలేదు. మరోవైపు ఓపెనర్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు 27ఓవర్ల వరకు క్రీజులో ఉన్నా కేవలం 138 పరుగులే జోడించడం జట్టుకు మైనస్ అయింది. మేం అద్భుతంగా బౌలింగ్ చేశామని భావించినా, రోహిత్, కోహ్లీల ఆట అంతగా ఆకట్టుకోలేదని’ బెన్ స్టోక్స్ వరల్డ్ కప్ మ్యాచ్ అనుభవాలను షేర్ చేసుకున్నాడు.    జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
బికినీ అందాలతో రెచ్చిపోయిన నటి