Tim Southee is the first player to take 300 Test, 200 ODI and 100 T20I wickets: న్యూజిలాండ్ సీనియర్ బౌలర్ టిమ్ సౌథీ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టెస్టుల్లో 300 వికెట్లు, వన్డేల్లో 200 వికెట్లు, టీ20ల్లో 100 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా అరుదైన ఘనత అందుకున్నాడు. శుక్రవారం టీమిండియాతో జరిగిన తొలి వన్డేలో భారత తాత్కాలిక కెప్టెన్ శిఖర్ ధావన్ వికెట్ తీసిన అనంతరం సౌథీ ఈ రికార్డు సృష్టించాడు. క్రికెట్‌లో ఇప్పటివరకు మరే బౌలర్‌ కూడా ఈ రికార్డు అందుకోలేదు. 33 ఏళ్ల సౌథీ న్యూజిలాండ్ జట్టుకు ప్రధాన పేసర్ అన్న విషయం తెలిసిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ టెస్టుల్లో 800 వికెట్స్, వన్డేల్లో 534 వికెట్స్ పడగొట్టినా.. టీ20ల్లో 13 వికెట్స్ మాత్రమే తీశాడు. దివంగత ఆస్ట్రేలియా స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ టెస్టుల్లో 708 వికెట్స్, వన్డేల్లో 293 వికెట్స్ పడగొట్టినా.. ఒక్క టీ20 వికెట్ కూడా తీయలేదు. అయితే వీరిద్దరూ కెరీర్ చివరి దశలో ఉన్న సమయంలో టీ20లు వచ్చాయి. బ్రెట్ లీ, షేన్ బాండ్, చమిందా వాస్, డ్వేన్ బ్రేవో లాంటి మాజీలతో పాటు ఇషాంత్ శర్మ, మొహమ్మద్ షమీ, పాట్ కమిన్స్ లాంటి సీనియర్లు కూడా టిమ్ సౌథీ రికార్డును నెలకొల్పలేకపోయారు. 



వన్డేల్లో 200 వికెట్లు పడగొట్టిన ఐదో న్యూజిలాండ్ బౌలర్‌గా కూడా టిమ్ సౌథీ నిలిచాడు. ఇప్పటివరకు సౌథీ టెస్టుల్లో 347 వికెట్లు, వన్డేల్లో 202 వికెట్లు, టీ20ల్లో 100 వికెట్లు తీశాడు. డేనియల్ వెటోరీ (297), కైల్ మిల్స్ (240), క్రిస్ హారిస్ (203), క్రిస్ కెయిన్స్ (200) వికెట్లు పడగొట్టారు. తాజాగా 200 వికెట్ల క్లబ్‌లో సౌథీ చేరాడు. సౌథీ ఇప్పటివరకు వన్డే కెరీర్‌లో 149 వన్డేలు ఆడి 202 వికెట్లు పడగొట్టాడు. సౌథీ సగటు 33.83గా ఉండగా.. అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు 33/7. 33 ఏళ్ల సౌథీ మరో 3-4 ఏళ్లు ఆడతాడు. కాబట్టి అతడు మరిన్ని రికార్డులు కూడా బద్దలు కొట్టే అవకాశం ఉంది. 



Also Read: Umran Malik: టీ20 ఫార్మాట్‌లో ఉమ్రాన్‌ మాలిక్ సక్సెస్‌ కాలేడు.. వసీమ్ జాఫర్‌ సంచలన వ్యాఖ్యలు!


Also Read: Ravindra Jadeja BJP: బంగ్లా టూర్‌కు రవీంద్ర జడేజా దూరం.. జడ్డు వెనకుంది ఆ బీజేపీ లీడరేనా?  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.