Wasim Jaffer said Umran Malik will be more successful in ODIs than T20Is: టీమిండియా యువ ఫాస్ట్‌బౌలర్ ఉమ్రాన్ మాలిక్‌పై భారత మాజీ ఆటగాడు వసీమ్ జాఫర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మాలిక్ టీ20ల కంటే వన్డేలకే సరిపోతాడన్నాడు. మాలిక్ బౌలింగ్‌లో ఎక్కువ వేరియేషన్స్ లేవని జాఫర్ అభిప్రాయపడ్డాడు. శుక్రవారం న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో ఉమ్రాన్ భారత్ వన్డేల్లోకి అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో మొదటి ఐదు ఓవర్లలో 19 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టిన ఉమ్రాన్.. తర్వాతి 5 ఓవర్లలో మాత్రం భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. మొత్తంగా 10 ఓవర్లలో 66 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ పడగొట్టాడు. ఈ నేపథ్యంలో ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ గురించి జాఫర్ మాట్లాడాడు.
ఈఎస్‌పీఎన్-క్రిక్‌ఇన్ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వసీమ్ జాఫర్ మాట్లాడుతూ... 'టీ20ల నుంచి వన్డేల్లోకి, అలానే వన్డేల్లోంచి టెస్టుల్లోకి మారుతున్న సమయంలో బౌలర్లు ఎక్కువ నైపుణ్యాలను కలిగి ఉండాలి. యువ బౌలర్లు వాటిని నేర్చుకుంటారు. ఉమ్రాన్ మాలిక్‌కు టీ20ల కంటే వన్డే ఫార్మాట్ సరిపోతుంది. టీ20 ఫార్మాట్‌లో సరైన లైన్, లెంగ్త్‌తో షార్ట్ బాల్‌ని వేయాల్సిన అవసరం వచ్చినప్పుడు ఉమ్రాన్ బౌలింగ్‌లో ఎక్కువ వేరియేషన్స్ లేవు. ఈ విషయాన్ని ఐపీఎల్ టోర్నీలో గమనించాం' అని అన్నాడు.
ఉమ్రాన్‌తో కలిసి అరంగేట్రం చేసిన లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ కూడా భారీగా పరుగులు ఇచ్చాడు. 8.1 ఓవర్లలో 68 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే అర్ష్‌దీప్ తిరిగి గాడిలో పడతాడని వసీమ్ జాఫర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. అర్ష్‌దీప్ నాణ్యమైన బౌలర్ కాబట్టి ఫార్మాట్‌కు త్వరగానే అలవాటు పడతాడన్నాడు. న్యూజిలాండ్ బ్యాటింగ్ ఆరంబించినపుడు పిచ్ బ్యాటర్లకు అనుకూలించిందని జాఫర్ అభిప్రాయపడ్డాడు. టామ్ లాథమ్ (145 నాటౌట్; 104 బంతుల్లో 19 ఫోర్లు, 5 సిక్స్‌లు), కెప్టెన్ కేన్ విలియమ్సన్ (94 నాటౌట్: 98 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) అద్భుతంగా ఆడారని, వారిని జోడీని విడదీయడం అంత సులువు కాదని భారత మాజీ ఓపెనర్ చెప్పాడు.
Also Read: Ravindra Jadeja BJP: బంగ్లా టూర్‌కు రవీంద్ర జడేజా దూరం.. జడ్డు వెనకుంది ఆ బీజేపీ లీడరేనా?
Also Read: చిన్నదా, పెద్దదా కాదు.. కంటెంట్ ఈజ్ ది కింగ్.. ఇదే లైవ్ ఎగ్జామ్‌పుల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.