Tokyo Paralympics: భారత స్టార్ పారా అథ్లెట్, జావెలిన్ త్రోయర్ దేవేంద్ర జఝరియా సరికొత్త చరిత్ర సృష్టించాడు. జాతీయ సెలక్షన్ ట్రయల్స్‌లో సత్తాచాటాడు. బుధవారం జరిగిన ట్రయల్స్‌లో 65.71 మీటర్లు జావెలిన్ విసిరి తనలో సత్తా ఇంకా తగ్గలేదని నిరూపించాడు. టోక్సో పారాలంపిక్స్ బెర్త్ ఖరారు చేసుకున్నాడు. నాలుగు పదుల వయసులోనూ తన రికార్డులను తానే ఇంకా మెరుగుపరుచుకోవడం ఆట పట్ల ఇండియా పారా అథ్లెట్‌ దేవేంద్ర జఝరియా అంకితభావాన్ని తెలుపుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టోక్యో పారా ఒలంపిక్స్ ట్రయల్స్‌లో భాగంగా 65.71 మీటర్ల మేర జావెలిన్ విసిరి, గతంలో తన రికార్డు 63.97మీటర్లను బద్ధలుకొట్టాడు. రియో ఒలింపిక్స్ కోసం నాలుగేళ్ల కిందట విసిరిన లక్ష్యాన్ని తాను అధిగమించడంపై హర్షం వ్యక్తం చేశాడు. ‘ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో నేడు జరిగిన ట్రయల్స్‌లో రికార్డు దూరం విసిరి గతంలో రియో ఒలింపిక్స్ కోసం విసిరిన లక్ష్యాన్ని సైతం అధిగమించి టోక్స్ పారా ఒలంపిక్స్ బెర్త్ ఖరారు చేసుకున్నాను’ అని ట్వీట్ చేశాడు. ఈ ఆగస్టులో ప్రారంభం కానున్న టోక్యో పారా ఒలంపిక్స్‌ (Tokyo Olympics)లో మరో స్వర్ణ పతకం సాధించాలని దేవెంద్ర జఝరియా ధీమాగా ఉన్నాడు. భారత స్టార్ పారా అథ్లెట్‌ దేవేంద్ర జఝరియా 2017లో భారత అత్యున్నత క్రీడాపురస్కారం రాజీవ్‌ ఖేల్‌రత్న అందుకున్నాడు. 


Also Read: India vs England Test Series: కీలక టెస్ట్ సిరీస్‌కు టీమిండియా యువ సంచలనం దూరం!



కుటుంబ మద్దతు, సహకారంతోనే నేను ఈ ఘనతను సాధించాను. కోచ్ సుశీల్ తన్వర్ మరియు ఫిట్‌నెస్ ట్రైనర్ లక్ష్య బాత్రా నన్ను ఈ విధంగా మలిచారని దేవేంద్ర జఝరియా తన విజయంలో వారిని భాగస్వాములు చేశాడు. ఆగస్టు 24 నుంచి టోక్యో పారా ఒలంపిక్స్ ప్రారంభం కానున్నాయి. కాగా, భారత (Team India) స్టార్ పారా అథ్లెట్ దేవెంద్ర జఝరియాకు ఇవి మూడో ఒలంపిక్స్ కావడం గమనార్హం. 2004లో ఏథెన్స్‌లో జరిగిన పారా ఒలంపిక్స్‌లో 62.15 మీటర్ల దూరం జావెలిన్ విసిరిన జఝరియా స్వర్ణాన్ని సాధించాడు. ఆపై 12 ఏళ్లకు రియో ఒలంపిక్స్‌లో మరో స్వర్ణాన్ని కొల్లగొట్టాడు. పారా ఒలంపిక్స్‌లో రెండు స్వర్ణాలు సాధించిన అథ్లెట్‌గా అరుదైన ఘనత తన ఖాతాలో వేసుకున్నాడు.


Also Read: Also Read: Kane Williamson: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో మరోసారి టాప్ లేపిన కేన్ విలియమ్సన్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook