Rashmika Mandanna: ఛలో అంటూ టాలీవుడ్‌ను పలకరించినా, గీత గోవిందం సినిమాలో సూపర్ హిట్ అందుకుంది కన్నడ బ్యూటీ రష్మకి మందన్న. అసలే లాక్‌డౌన్ కావడంతో ఇంటి వద్ద సేదతీరుతోంది. సోషల్ మీడియాలో ఫాలోయర్లను సైతం భారీగానే సొంతం చేసుకుంది. క్రికెట్ అంటే ఇష్టమా, ఫెవరెట్ క్రికెటర్ ఎవరు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఏ జట్టు తన ఫెవరెట్ అనే పలు విషయాలపై రష్మిక మందన్న స్పందించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్ణాటక అమ్మాయి కావడంతో సహజంగానే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఆమె రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)కి వీరాభిమాని. ఈ ఏడాది ఐపీఎల్ 2021 ప్రారంభమైన సమయంలో ఈ సాల కప్ నమదే అంటూ ఆర్సీబీకి క్యూట్ భామ రష్మిక మందన్న (Rashmika Mandanna) మద్దతు తెలిపింది. అయితే అనూహ్యంగా ఆమె ఫెవరెట్ క్రికెటర్ ఛేజింగ్ స్టార్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కాదట. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి తాను వీరాభిమానిని అంటోంది. ఎంఎస్ ధోనీ మాస్టర్ క్లాస్ ప్లేయర్ అని, అతడి కెప్టెన్సీగానీ, వికెట్ కీపింగ్, బ్యాటింగ్ అంటే తనకు ఇష్టమని కన్నడ భామ రష్మిక ఇటీవల సోషల్ మీడియా ద్వారా పలు విషయాలు వెల్లడించింది. 


Also Read: Nandyala Ravi Dies: కోవిడ్-19తో టాలీవుడ్ డైరెక్టర్ నంద్యాల రవి కన్నుమూత


టాలీవుడ్ నటి రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతోన్న  పుష్ప సినిమాలో నటిస్తుంది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఓ బాలీవుడ్ సినిమాకు ఇటీవల సంతకం చేసింది. మిస్టర్ మజ్నూ సినిమాతో హిందీ చిత్రసీమకు పరిచయమైందని తెలిసిందే. దక్షిణాదిన పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్, కరోనా కర్ష్యూలు విధించడంతో కొన్ని రోజులు షూటింగ్‌లు వాయిదా పడ్డాయి. కోవిడ్-19 (COVID-19) కట్టడికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి.


Also Read: PM Kisan Samman Nidhi Status: రైతుల ఖాతాల్లోకి రూ.2000 జమ, PM Kisan స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook