Tollywood Director Nandyala Ravi Passes Away : కరోనా సెకండ్ వేవ్ మరింత ప్రమాదకరంగా మారుతోంది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం పలువురు కోవిడ్19 మహమ్మారితో పోరాడుతూ మరణించారు. నటుడు, సినీ జర్నలిస్టు టీఎన్ఆర్ మరణవార్తను మరిచిపోక ముందే తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. సినీ రచయిత, దర్శకుడు నంద్యాల రవిని కన్నుమూశాడు.
టాలీవుడ్ దర్శకుడు నంద్యాల రవికి కొన్ని రోజుల కిందట కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయించుకోగా కోవిడ్19 పాజిటివ్‌గా తేలింది. ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నాడు. టాలీవుడ్ (Tollywood) కమెడియన్, నటుడు సప్తగిరి తనవంతుగా లక్ష రూపాయాల ఆర్థిక సహాయం కూడా అందించాడు. కానీ వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో కరోనా మహమ్మారితో పోరాడుతూనే శుక్రవారం ఉదయం నంద్యాల రవి తుదిశ్వాస విడిచాడని సమాచారం.
Writer / Director #NandyalaRavi passes away this morning due to #Covid19
Om Shanthi pic.twitter.com/KCjk5EM3Fa
— BARaju (@baraju_SuperHit) May 14, 2021
రాజ్ తరుణ్ నటించి ఒరెయ్ బుజ్జిగా సినిమాకు సినీ రచయితగా చేశాడు. నాగశౌర్య నటించిన లక్ష్మీ రావే మా ఇంటికి సినిమాకు నంద్యాల రవి దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం సప్తగిరి నటిస్తున్న సినిమా కామెడీ ఎంటర్‌టైనర్‌కు ఆయన దర్శకత్వం వహిస్తున్నాడు. అంతలోనే కరోనా వైరస్ (CoronaVirus) బారిన పడిన నంద్యాల రవిని కరోనా రక్కసి కాటేసింది. దర్శకుడు నంద్యాల రవి మరణం పట్ల తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన వారు సంతాపం ప్రకటిస్తున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Also Read: Covid-19: ఫేస్ మాస్కులు సుదీర్ఘకాలం వాడితే శరీరంలో Oxygen తగ్గుతుందా, నిజమిదే
Shocked by the news,
You fought till the last:(
#NandyalaRavi
My Deepest Condolences 💐🙏🏻 pic.twitter.com/UKvH8NxThv— Naga Shaurya (@IamNagashaurya) May 14, 2021
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook