ధర్మశాల వన్డేలో శ్రీలంకపై దారుణ రీతిలో టీమిండియా పరాజయం పాలైన విషయం తెలిసిందే. కాగా ఈ మ్యాచ్ లో కోహ్లీ లేని లోటు స్పష్టంగా కనిపించింది. లంకతో జరిగిన  మ్యాచ్ లో 112 పరుగులకే కుప్పకూలిన విషయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సాధారణ జట్టు శ్రీలంకపై వరల్డ్ నెంబర్ హోదాలో ఉన్న టీమిండియా ఇంత దారుణ పరాజయంపై సోషల్ మీడియాలో అభిమానులు అగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కోక్కరు ఒక్కో రీతిలో సెటైర్లు సంధించారు. 
* కోహ్లీ పెళ్లికి వెళ్లే హడావుడిలో టీమిండియా నిర్లక్ష్యంగా ఆడిందని  కొందరు సెటైర్ల పేల్చారు.. 
*  మరికొందరైతే పరాజయానికి కారణం కోహ్లీయే అని ...అతను లేకపోవడం వల్లే ఇంతటి దారుణ పరాజయమని వెల్లడించారు.
* కోహ్లీ లేకపోవడం వల్లే ఇలా జరిగిందని.. కోహ్లీ లేని జట్టును ఊహించలనేమని  ట్విట్టర్ ద్వారా కొందరు అభిమానులు తమ ఆవేదనను ఇలా వెళ్లగక్కారు. 
* అనుష్కను పెళ్లాడేందుకు వెళ్లిన కోహ్లీ ..తన పెళ్లిని రద్దు చేసుకొని వెంటనే టీమిండియాలో చేరాలనే ట్విట్టర్ ద్వారా కోరారు.
* విరాట్‌ కోహ్లీ పెళ్లికి ఆహ్వానించనందుకే భారత క్రికెట్‌ జట్టు ఇలాంటి నిరాశాజనక ప్రదర్శన చేసింది. కానీ ఫర్వాలేదు! ఇలా తమకు తోచిన రీతిలో ట్విటర్‌లో సెటైర్లు పేల్చారు...
 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సెటైర్లను యథాతథంగా ఓసారి పరిశీలిద్దాం...


బ్రేకింగ్‌ న్యూస్‌: విరాట్‌ కోహ్లీ- అనుష్కశర్మ పెళ్లి వాయిదా పడింది. సాయంత్రమే కోహ్లీ వచ్చి జట్టులో చేరుతాడని బీసీసీఐ ప్రకటించింది! 


ఇప్పుడే అందిన వార్త: కోహ్లీ-అనుష్క వివాహం రద్దు. ..కోహ్లీ వెంటనే డ్రెస్సింగ్‌ రూమ్‌లో రిపోర్ట్‌ చేయాలని రవిశాస్త్రి ఆదేశం.


‘అనుష్క శర్మ: నువ్వు లేకుండా బతకలేను 
విరాట్‌ కోహ్లీ : నేను కూడా 
టీమిండియా: డిట్టో’
టీమిండియాతో విరాట్‌ కోహ్లీ: ఎవ్వర్నీ ఆహ్వానించడం లేదు. అనుష్క ఇదే చెప్పింది. 
భారత జట్టు: ఐతే.. ఈరోజు మేమెవ్వరం బ్యాటింగ్‌ చేయం
* విరాట్‌ కోహ్లీ పెళ్లికి ఆహ్వానించనందుకే భారత క్రికెట్‌ జట్టు ఇలాంటి నిరాశాజనక ప్రదర్శన చేసింది. కానీ ఫర్వాలేదు!


ఆటలో గెలుపు ఓటములు సహజమని.. కొన్ని సందర్భల్లో ఇలాంటి చేదు అనుభవాలు ఎదురౌతాయన్నారు. సోషల్‌ మీడియాలో కొందరు సెటైర్ల పేరుతో అతిగా ప్రవర్తిస్తున్నారు’ ఇది టీమిండియా ఆటపై ప్రభావితం చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి...